సుప్రీంకోర్టులో సునీత పిటిషన్‌

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిలు మంజూరుచేస్తూ తెలంగాణ హైకోర్టు మే 31న జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు.

Updated : 07 Jun 2023 06:25 IST

అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిలుపై సవాలు

ఈనాడు, దిల్లీ: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిలు మంజూరుచేస్తూ తెలంగాణ హైకోర్టు మే 31న జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. ఈ కేసును ఆమె తరఫు న్యాయవాదులు ధర్మాసనం ముందు బుధవారం మెన్షన్‌ చేసే అవకాశం ఉంది. ఈ హత్యకేసులో అవినాష్‌రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ పేర్కొంటున్నందున ఆయనకు ముందస్తు బెయిలు రద్దుచేయాలని ఆమె ఇందులో కోరారు. సీబీఐ ఇప్పటివరకు దాఖలుచేసిన ఛార్జిషీట్లు, అఫిడవిట్లలో అవినాష్‌రెడ్డిపై చేసిన అభియోగాలన్నీ తీవ్రమైనవేనని, హైకోర్టు వాటిని సరిగా పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. జూన్‌ 30లోగా దర్యాప్తును ముగించాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ముందస్తు బెయిలు రద్దు చేసి దర్యాప్తు సజావుగా సాగేందుకు వీలు కల్పించాలని కోరారు. సునీత పిటిషన్‌ విచారణలో సీబీఐ కూడా సుప్రీంలో వాదనలు వినిపించనుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు