ఎసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు?

రాష్ట్రంలో 1954 తర్వాత పేదలకు పంపిణీ చేసిన ఎసైన్డ్‌ భూములపై రాష్ట్ర ప్రభుత్వం సుమారు 20 ఏళ్ల కాల పరిమితితో యాజమాన్య హక్కులు కల్పించే అవకాశం కనిపిస్తోంది.

Published : 07 Jun 2023 03:16 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 1954 తర్వాత పేదలకు పంపిణీ చేసిన ఎసైన్డ్‌ భూములపై రాష్ట్ర ప్రభుత్వం సుమారు 20 ఏళ్ల కాల పరిమితితో యాజమాన్య హక్కులు కల్పించే అవకాశం కనిపిస్తోంది. బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి భూములు పొందినవారు లేదా వారి వారసులు మాత్రమే వాటిని అనుభవించాలన్నది ఇంతవరకు ఉన్న నిబంధన. అందుకే వాటిని నిషిద్ధ జాబితాలో చేర్చారు. అయితే కొంత కాలపరిమితి విధించి వాటిని అమ్ముకోడానికి వీలుగా యాజమాన్యహక్కు కల్పించాలన్న అంశంపై రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ చర్చించింది. ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులపైనా అధ్యయనం చేసింది. దీనిపై కేబినెట్‌ భేటీలో చర్చించన్నట్లు సమాచారం.

నేడు మంత్రివర్గ సమావేశం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన సచివాలయం కేబినెట్‌ మీటింగ్‌ హాల్‌లో ఈ సమావేశం జరగనుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు