శాఖాపరమైన విచారణ లేకుండా చర్యలు సరికాదు
ఛార్జి మెమో ఇవ్వకుండా, శాఖాపరమైన విచారణ చేయకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగికి నేరుగా శిక్ష విధించడం సరికాదని, ఇలా చేయడం సర్వీసు నిబంధనలకు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని హైకోర్టు తేల్చిచెప్పింది.
స్పష్టంచేసిన హైకోర్టు
ఓ ఉద్యోగికి 1987లో విధించిన శిక్ష రద్దు
ఈనాడు, అమరావతి: ఛార్జి మెమో ఇవ్వకుండా, శాఖాపరమైన విచారణ చేయకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగికి నేరుగా శిక్ష విధించడం సరికాదని, ఇలా చేయడం సర్వీసు నిబంధనలకు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని హైకోర్టు తేల్చిచెప్పింది. కేవలం సంజాయిషీ నోటీసు ఇచ్చి.. దానికి ఇచ్చిన వివరణ సంతృప్తిగా లేదని ఓ ఉద్యోగికి రెండు ఇంక్రిమెంట్లను నిరవధికంగా నిలుపుదల చేస్తూ అధికారులు 1987 నవంబర్ 9న విధించిన శిక్షను రద్దు చేసింది. ఆ ఉద్యోగి సర్వీసు ప్రయోజనాలు పొందేందుకు అర్హుడని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ వి.గోపాలకృష్ణారావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చింది. 36 ఏళ్ల కిందట అధికారులు విధించిన శిక్షను హైకోర్టు ఇప్పుడు రద్దు చేసింది. మరోవైపు శిక్ష విధింపు సమయంలో ఆ ఉద్యోగికి 31 ఏళ్లుకాగా.. ప్రస్తుతం 67 ఏళ్లు.
* పట్టు పరిశ్రమశాఖలో ఇన్‌స్పెక్టర్‌గా సీహెచ్ లక్ష్మీనరసయ్య పనిచేస్తుండగా ఆయన సేవలు సంతృప్తిగా లేవని అధికారులు షోకాజ్ నోటీసు ఇచ్చారు. లక్ష్మీనరసయ్య ఇచ్చిన వివరణ సరిగా లేదని, ఇంక్రిమెంట్లో కోత విధించారు. 1987లో విధించిన ఈ శిక్షను సవాలు చేస్తూ ఆయన అధికారుల ముందు అప్పీల్, రివిజన్ దాఖలు చేశారు. వాటిని అధికారులు తోసిపుచ్చారు. దీంతో 2005లో ఏపీ పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా 2006లో పిటిషన్‌ను కొట్టేసింది. దానిని సవాలుచేస్తూ 2015లో హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు.. ఏపీఏటీ ఉత్తర్వులను రద్దు చేసింది. పిటిషన్‌దారు అన్ని ఆర్థిక ప్రయోజనాలకు అర్హులని స్పష్టంచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TS News: భారాసకు రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గుడ్‌బై
-
Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి బస్సు యాత్రకు ఏర్పాట్లు?
-
Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు
-
TDP: ఎవరెస్ట్ వద్ద ఎగిరిన పసుపుజెండా
-
Justice Lakshmana Reddy: జస్టిస్ లక్ష్మణరెడ్డి అరుదైన రికార్డు
-
మీ వాళ్లు కబ్జా చేస్తే.. మీరు సెటిల్మెంట్ చేశారు: ఆదోని ఎమ్మెల్యే కుమారుడిని చుట్టుముట్టిన జనం