మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించండి

రాష్ట్రంలో కొత్తగా ప్రారంభం కానున్న అయిదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ తరగతుల ప్రారంభానికి తగ్గట్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు.

Updated : 07 Jun 2023 05:10 IST

కొత్త వైద్య కళాశాలలపై సమీక్షలో మంత్రి రజిని

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ప్రారంభం కానున్న అయిదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ తరగతుల ప్రారంభానికి తగ్గట్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. విజయనగరం, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల కళాశాలల్లో మౌలిక వసతులపై ఆయా జిల్లా కలెక్టర్లతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల అవసరాలకు తగ్గట్లు వసతి గృహాలు సిద్ధం చేయాలని, శానిటేషన్‌, హౌస్‌ కీపింగ్‌, సెక్యూరిటీ, బస్సుల నిర్వహణ, నియామకాలు చేపట్టేందుకు ఇప్పటి నుంచి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రానున్న మూడు సంవత్సరాల్లో మరో 12 వైద్య కళాశాలలు రానున్నాయన్నారు. కొత్త కళాశాలల భవనాల నిర్మాణాలు, ఇతర వాటికి కలిపి సుమారు రూ.8,500 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు