జేజేఎం పనుల్లో పంచాయతీలను భాగస్వాములను చేయాలి

జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం) పనుల్లో పంచాయతీలు, మహిళా స్వయంశక్తి సంఘాలను పెద్దఎత్తున భాగస్వాములను చేయాలని కేంద్ర తాగునీరు, శానిటేషన్‌ వ్యవహారాలశాఖ కార్యదర్శి విని మహాజన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

Published : 07 Jun 2023 04:16 IST

కేంద్ర తాగునీరు, శానిటేషన్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి విని మహాజన్‌

ఈనాడు, అమరావతి: జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం) పనుల్లో పంచాయతీలు, మహిళా స్వయంశక్తి సంఘాలను పెద్దఎత్తున భాగస్వాములను చేయాలని కేంద్ర తాగునీరు, శానిటేషన్‌ వ్యవహారాలశాఖ కార్యదర్శి విని మహాజన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సచివాలయంలో మంగళవారం ఆమె రాష్ట్రంలో జేజేఎం కార్యక్రమాలపై సమావేశమయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. అన్ని కాలాల్లోనూ తాగునీరు నేరుగా గృహాలకు సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ద్రవ వ్యర్థాలు నిల్వ ఉండటానికి వీల్లేదని అన్నారు. ప్రతి ఇంటికీ కుళాయి, మరుగుదొడ్డి సౌకర్యం అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని