ప్రారంభించకుండానే మొరాయింపు!

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో చెత్త ఆటోలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఏడెనిమిది నెలల కిందటే ఆటోలను తెప్పించింది.

Published : 08 Jun 2023 05:12 IST

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో చెత్త ఆటోలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఏడెనిమిది నెలల కిందటే ఆటోలను తెప్పించింది. కానీ, అప్పటి నుంచి వాటిని పంపిణీ చేయలేదు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, ఏలూరుకు చెందిన ఆటోలను అధికారులు గుంటూరు కార్పొరేషన్‌, మున్సిపల్‌ కార్యాలయం షెడ్లు, వార్డు కార్యాలయాల ఆవరణలో ఉంచారు. ఇన్నాళ్ల తర్వాత వాటిని సీఎం చేతుల మీదుగా పంపిణీ చేయించేందుకు నేడు (గురువారం) ముహూర్తం పెట్టారు. అందుకే.. ఆటోలన్నింటినీ బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు తరలించాలని చూడగా.. 60 ఆటోలు మొరాయించాయి. వాటిలో బ్యాటరీ, స్టీరింగ్‌, బ్రేకుల్లో సమస్యలు వచ్చాయి. దీంతో తాత్కాలిక డ్రైవర్లను పెట్టి రిపేరుకొచ్చిన ఆటోలను బాగున్నవాటి వెనుక తాడుతో కట్టి మరమ్మతులకు తరలించారు.

 ఈనాడు, అమరావతి, గుంటూరు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు