మూసివేత దిశగా 38 ఫెర్రో పరిశ్రమలు!

రాష్ట్రంలో ఫెర్రో పరిశ్రమల చరిత్ర ముగియనుందా? జగన్‌ ప్రభుత్వం బాదుడు, మార్కెట్‌లో ధరల పతనంతో పరిశ్రమలను మూసివేయడానికి సిద్ధమవుతున్నారా? ఆదుకోవాల్సిన ప్రభుత్వమే విద్యుత్తు ఛార్జీలు పెంచడంతో యజమానులు విసుగు చెందారా? అని ప్రశ్నిస్తే నిజమేనని చెబుతున్నారు ఫెర్రో అసోసియేషన్‌ ప్రతినిధులు.

Published : 08 Jun 2023 05:12 IST

ప్రభుత్వ చర్యలే కారణం

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఫెర్రో పరిశ్రమల చరిత్ర ముగియనుందా? జగన్‌ ప్రభుత్వం బాదుడు, మార్కెట్‌లో ధరల పతనంతో పరిశ్రమలను మూసివేయడానికి సిద్ధమవుతున్నారా? ఆదుకోవాల్సిన ప్రభుత్వమే విద్యుత్తు ఛార్జీలు పెంచడంతో యజమానులు విసుగు చెందారా? అని ప్రశ్నిస్తే నిజమేనని చెబుతున్నారు ఫెర్రో అసోసియేషన్‌ ప్రతినిధులు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 38 ఫెర్రో పరిశ్రమలు ప్రభుత్వ చర్యల కారణంగా మూత పడే స్థితికి చేరుకున్నాయి. ఫెర్రో పరిశ్రమల ప్రతినిధులు మంగళవారం జూమ్‌లో సమావేశమై జులై 1 నుంచి పరిశ్రమలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమలపై విధించిన రూ. 300 కోట్ల అదనపు భారాన్ని తగ్గించాలని, విద్యుత్తు ఛార్జీల బాదుడు ఆపాలని ఫెర్రో యూనియన్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు రెండు నెలల క్రితం ప్రభుత్వాన్ని కోరినా ఆశించిన స్పందన రాకపోవడంతో 38 పరిశ్రమలనూ మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో ఫెర్రో పరిశ్రమల ప్రతినిధులు గట్టిగా ప్రశ్నించడంతో ఆగ్రహించిన సీఎం జగన్‌.. వీరిని హెచ్చరించారు. దీంతో మూసివేత నిర్ణయాన్ని బయటకు తెలియనివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. విశాఖ బిజినెస్‌ సమిట్‌పై  సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన రెండు రోజులకే ఫెర్రో పరిశ్రమ వర్గాల నుంచి ఈ నిర్ణయం వెలువడటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని