శ్రీవారి ఆలయ సమీపంలో ముద్దుపై విమర్శలు

ఆదిపురుష్‌ చిత్ర దర్శకుడు ఓం రౌత్‌, హీరోయిన్‌ కృతిసనన్‌తో పాటు చిత్రబృంద సభ్యులు బుధవారం ఉదయం శ్రీవారి అర్చనానంతర సేవలో పాల్గొన్నారు.

Updated : 08 Jun 2023 06:35 IST

ఆదిపురుష్‌ దర్శకుడి చర్యపై దుమారం

తిరుమల, న్యూస్‌టుడే: ఆదిపురుష్‌ చిత్ర దర్శకుడు ఓం రౌత్‌, హీరోయిన్‌ కృతిసనన్‌తో పాటు చిత్రబృంద సభ్యులు బుధవారం ఉదయం శ్రీవారి అర్చనానంతర సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం సమీపంలో ఓం రౌత్‌.. కృతిసనన్‌కు వీడ్కోలు చెబుతూ ఆమెను ఆలింగనం చేసుకుని ముద్దుపెట్టారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఆలయం సమీపంలో ఆయన ఇలా చేయడంతో విమర్శలు వచ్చాయి.


వదంతులు నమ్మొద్దు: ఎస్పీ

తిరుపతి (నేరవిభాగం): ఆదిపురుష్‌ సినిమా ప్రదర్శించే థియేటర్‌లోకి ఓ సామాజికవర్గానికి ప్రవేశం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఎస్పీ పరమేశ్వరరెడ్డి కోరారు. వైరల్‌ అవుతున్న ఆ పోస్టర్‌ను ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినా, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు