నవీ ముంబయిలో కొలువుదీరనున్న శ్రీవారు
మహారాష్ట్ర ప్రజల చిరకాల కోరికను నెరవేర్చి, ఆశీర్వదించడానికి తిరుమల బాలాజీ నవీ ముంబయిలో కొలువుదీరబోతున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే సంతోషం వ్యక్తం చేశారు.
ఆలయ నిర్మాణానికి భూమి పూజ
రూ.70 కోట్ల విరాళమిచ్చిన రేమండ్ సంస్థ
తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే, ఠాణె,: మహారాష్ట్ర ప్రజల చిరకాల కోరికను నెరవేర్చి, ఆశీర్వదించడానికి తిరుమల బాలాజీ నవీ ముంబయిలో కొలువుదీరబోతున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే సంతోషం వ్యక్తం చేశారు. నవీ ముంబయిలోని ఉల్వేలో పదెకరాల స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి బుధవారం శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వామివారి ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. తితిదే ఛైర్మన్ వైవీ సబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల ఆలయం తరహాలో స్వామివారి ఆలయం నిర్మించాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సూచించారన్నారు. నిర్మాణానికయ్యే ఖర్చు కోసం రేమండ్ సంస్థ రూ.70 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించారు. రెండేళ్లలోనే ఆలయం పూర్తవుతుందని తెలిపారు. భూమిపూజలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, రేమండ్ సంస్థ ఛైర్మన్, ఎండీ గౌతమ్ సింఘానియా, తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.