ఆహార భద్రతా ప్రమాణాల్లో 17వ స్థానంలో ఏపీ

కేంద్ర ఆహారభద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ బుధవారం విడుదల చేసిన రాష్ట్రాల ఆహారభద్రతా ప్రమాణాల సూచీలో తెలంగాణ 14, ఆంధ్రప్రదేశ్‌ 17వ స్థానంలో నిలిచాయి.

Published : 08 Jun 2023 05:29 IST

తెలంగాణది 14వ స్థానం

ఈనాడు, దిల్లీ: కేంద్ర ఆహారభద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ బుధవారం విడుదల చేసిన రాష్ట్రాల ఆహారభద్రతా ప్రమాణాల సూచీలో తెలంగాణ 14, ఆంధ్రప్రదేశ్‌ 17వ స్థానంలో నిలిచాయి. దేశంలోని 20 పెద్ద రాష్ట్రాలు, 8 చిన్న రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలను మూడు కేటగిరీలుగా విభజించి ప్రకటించిన ర్యాంకులను ఇక్కడ కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, సహాయమంత్రి ఎస్‌పీసింగ్‌ భేగల్‌, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈవో కమలవర్ధన్‌రావు ఇక్కడి విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఆహారభద్రతా ప్రమాణాల పరిశీలనకు ఆరు కేటగిరీల్లో మార్కులు నిర్దేశించి పనితీరును లెక్క తేల్చారు. తెలంగాణ 32 మార్కులు సాధించి 14వ స్థానంలో నిలవగా, 24 మార్కులతో ఆంధ్రప్రదేశ్‌ 17వ స్థానానికి పరిమితమైంది. పెద్దరాష్ట్రాల్లో కేరళ, పంజాబ్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లు తొలి 5 స్థానాల్లో నిలిచాయి. ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, బిహార్‌, ఝార్కండ్‌లు చివరి 5 స్థానాలకు పరిమితమయ్యాయి. తెలంగాణ గత ఏడాదితో పోలిస్తే ఒక ర్యాంకు మెరుగుపడగా, ఆంధ్రప్రదేశ్‌ యథాతథంగా 17వ స్థానంలోనే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని