జమ్మూ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ

జమ్మూలోని మజీన్‌ గ్రామంలో తావి నది ఒడ్డున తితిదే నిర్మించిన శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణలో భాగంగా బుధవారం శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ చేశారు.. బింబశుద్ధి, శ్రీ వేంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, గోదాదేవి, గరుడాళ్వార్‌, ద్వారపాలకుల విగ్రహాలను పవిత్ర జలాలతో శుద్ధి చేశారు.

Published : 08 Jun 2023 05:29 IST

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: జమ్మూలోని మజీన్‌ గ్రామంలో తావి నది ఒడ్డున తితిదే నిర్మించిన శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణలో భాగంగా బుధవారం శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ చేశారు.. బింబశుద్ధి, శ్రీ వేంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, గోదాదేవి, గరుడాళ్వార్‌, ద్వారపాలకుల విగ్రహాలను పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. యాగశాలలో రత్నన్యాసం, ధాతున్యాసం అనంతరం విమాన కలశ స్థాపన, విగ్రహ ప్రతిష్ఠ చేశారు. సాయంత్రం యాగశాలలో వైదిక క్రతువులు చేపట్టారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తితిదే ఛైర్మన్‌ సతీమణి స్వర్ణలత, జేఈవో వీరబ్రహ్మం, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కంకణభట్టార్‌ రామకృష్ణ దీక్షితులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని