ఉపాధ్యాయ సమస్యలపై పోరు

ఉపాధ్యాయుల దశల వారీ ఉద్యమంలో భాగంగా ఫ్యాప్టో రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు, ఎన్టీఆర్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పలు ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నాయకులు విజయవాడలోని కలెక్టరేట్‌ వద్ద గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Updated : 09 Jun 2023 06:17 IST

జీవో 117 రద్దు కోరుతూ ‘ఫ్యాప్టో’ నిరసన

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల దశల వారీ ఉద్యమంలో భాగంగా ఫ్యాప్టో రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు, ఎన్టీఆర్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పలు ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నాయకులు విజయవాడలోని కలెక్టరేట్‌ వద్ద గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న జీవో ఎం.ఎస్‌. నంబరు 117ను రద్దు చేయాలని, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి..ఉపాధ్యాయులతో అనుసరిస్తున్న వైఖరిని నిరోధించాలని నినదించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌కుమార్‌కు అందజేశారు. ఫ్యాప్టో ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ ఖాశీం, ఫ్యాప్టో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు నక్కా వెంకటేశ్వర్లు, ఎస్‌.ఎం.ఇమామ్‌బాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తిమ్మన్న, డిప్యూటీ ఛైర్మన్‌ గంధం రామారావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ అలవాల సుందరయ్య, వేముల భిక్షమయ్య, కార్యవర్గ సభ్యుడు అనుగ్రహ ప్రసాద్‌, ఎస్టీయూ రాష్ట్ర నేత కొమ్ము ప్రసాద్‌, ఏపీటీఎఫ్‌ జిల్లా కౌన్సిలర్‌ షేక్‌ మునీర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని