అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే మార్గదర్శిపై దాడులు: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ‘ఈనాడు’ ప్రశ్నిస్తోందన్న అక్కసుతో మార్గదర్శి సంస్థపై ప్రభుత్వం దాడులు చేయిస్తోందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు.
శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ‘ఈనాడు’ ప్రశ్నిస్తోందన్న అక్కసుతో మార్గదర్శి సంస్థపై ప్రభుత్వం దాడులు చేయిస్తోందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. ఈ విషయంలో సీఐడీ దుందుడుకు చర్యలను ఆయన తప్పుపట్టారు. శ్రీకాళహస్తి ప్రెస్‌క్లబ్ ఆవరణలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు చేసే తప్పులను పత్రికలు ప్రశ్నిస్తాయన్నారు. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులకు ఉందని, వైకాపా అందుకు భిన్నంగా కక్షపూరితంగా వ్యవహరించడం తగదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన మన్నవరం విద్యుదీకరణ ప్రాజెక్టు, నడికుడి-శ్రీకాళహస్తి, అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి ఏమైందని నిలదీశారు. తరచూ దిల్లీకి వెళ్తున్న సీఎం జగన్ దిల్లీ పెద్దలతో ఏం చర్చించారన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలన్నారు. చంద్రబాబు దిల్లీకి వెళ్లి అమిత్‌షా, నడ్డాను ఎందుకు కలిశారన్నదానిపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. వైకాపా, తెదేపా, భాజపా త్రీ ఇన్ వన్‌గా మారాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనూ 120 స్థానాలు గెలుపొందడం ఖాయమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Supreme Court: ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
CISF constable: దిల్లీలో చీపురుపల్లి కానిస్టేబుల్ ఆత్మహత్య
-
Galaxy S23 FE: శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ విడుదల.. 50MP కెమెరా, 4,500 బ్యాటరీ
-
China: సముద్ర ఉచ్చులో చైనా అణు జలాంతర్గామి.. 55 మంది సబ్‌మెరైనర్ల మృతి..!
-
KTR: దిల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ అలా మాట్లాడారా?: కేటీఆర్
-
Rajinikanth: ‘తలైవా 170’ గురించి ఆసక్తికర విషయం పంచుకున్న రజనీకాంత్..