516 ఈ-ఆటోల్ని ప్రారంభించిన సీఎం
క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమంలో భాగంగా మరో 36 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో చెత్త సేకరణకు ఉద్దేశించిన 516 ఈ-ఆటోలను ముఖ్యమంత్రి జగన్ గురువారం జెండా ఊపి ప్రారంభించారు.
రూ.21.18 కోట్లతో కొనుగోలు
ఈనాడు, అమరావతి: క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమంలో భాగంగా మరో 36 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో చెత్త సేకరణకు ఉద్దేశించిన 516 ఈ-ఆటోలను ముఖ్యమంత్రి జగన్ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఒక్కో ఆటోకు రూ.4.10 లక్షల చొప్పున రూ.21.18 కోట్లను ప్రభుత్వం వ్యయం చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఆటోల ప్రారంభోత్సవంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, ధర్మాన ప్రసాదరావు, గుమ్మనూరు జయరాం, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ‘రాబోయే రోజుల్లో చెత్త రహిత రాష్ట్రం సాకారం కానుంది. ఈ-ఆటోలతో చెత్త సేకరిస్తాం. మురుగునీటిని శుద్ధి చేసే ప్రాజెక్టులు, వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి’ అని పురపాలకశాఖ మంత్రి సురేష్ మీడియాకు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. 19,500 చేరువకు దిగొచ్చిన నిఫ్టీ
-
BJP: భారత తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ!
-
Taiwan: చైనాకు భారీ షాకిచ్చిన తైవాన్.. సొంతంగా సబ్మెరైన్ తయారీ..!
-
Manipur Violence: ‘కనీసం అస్థికలైనా తెచ్చివ్వండి’.. మణిపుర్లో ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన
-
Raveena Tandon: అతడి పెదవులు తాకగానే వాంతి అయింది: రవీనా టాండన్
-
Vijay Deverakonda-Rashmika: విజయ్ దేవరకొండ.. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్: రష్మిక