దేశవ్యాప్తంగా 50 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి
2023-24 విద్యాసంవత్సరానికి దేశం మొత్తమ్మీద 50 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి ఇచ్చినట్లు జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) వెల్లడించింది.
వాటిలో తెలంగాణకు 13, ఏపీకి 5
ఈనాడు, హైదరాబాద్, దిల్లీ: 2023-24 విద్యాసంవత్సరానికి దేశం మొత్తమ్మీద 50 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి ఇచ్చినట్లు జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) వెల్లడించింది. తెలంగాణలో 13, ఆంధ్రప్రదేశ్‌లో 5 వైద్య కళాశాలలు ఉన్నాయి. దేశంలో 6,200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానుండగా తెలంగాణలో 1500, ఆంధ్రప్రదేశ్‌లో 750 సీట్లు పెరగనున్నాయని తెలిపింది. తెలంగాణలో ప్రారంభం కానున్న వైద్య కళాశాలల్లో 9 ప్రభుత్వ వైద్య కళాశాలలు కాగా 4 ప్రయివేటువి.
* తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి ఆసిఫాబాద్, వికారాబాద్, భూపాలపల్లి, జనగామ, సిరిసిల్ల, నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ వైద్య కళాశాలల్లో ఒక్కో దాంట్లో 100 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున మొత్తం 900 సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా సీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అరుంధతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఫాదర్ కొలంబో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నీలిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాలకు అనుమతి రాగా ఒక్కో కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున 600 సీట్లు మంజూరయ్యాయి.
* ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరంలలో ప్రభుత్వ కాలేజీలకు అనుమతించింది. ఇందులో ఒక్కో కాలేజీకి 150 సీట్లు కేటాయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ సినిమా ఫ్లాప్.. నన్ను చచ్చిపోమన్నారు: హీరోయిన్
-
CBFC: విశాల్ ఆరోపణలు.. సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం.. అదేంటంటే?
-
Google Bard - Team India: వన్డే ప్రపంచకప్.. గూగుల్ బార్డ్ చెప్పిన భారత్ తుది జట్టు ఇదే
-
Team India Final XI: ప్రపంచకప్‌లో ఏ 11 మంది దిగితే మంచిది? మీ ఆలోచన ఏంటి?
-
Hyderabadi Biryani: హైదరాబాదీ బిర్యానీ X కరాచీ బిర్యానీ.. పాక్ ఆటగాళ్లు ఎంత రేటింగ్ ఇచ్చారంటే?
-
Viral video: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. 20 నిమిషాలు నరకయాతన