కృష్ణా బోర్డు మినిట్స్‌పై ఏపీ అభ్యంతరం

జలాల పంపిణీకి సంబంధించి గత నెలలో జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం అనంతరం.. బోర్డు విడుదల చేసిన మినిట్స్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Updated : 10 Jun 2023 05:49 IST

కేఆర్‌ఎంబీకి లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: జలాల పంపిణీకి సంబంధించి గత నెలలో జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం అనంతరం.. బోర్డు విడుదల చేసిన మినిట్స్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌.. కేఆర్‌ఎంబీకి లేఖ రాశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను 34:66 నిష్పత్తి ప్రకారమే పంపిణీ చేయాలని తాము కోరితే.. రెండు రాష్ట్రాల మధ్య 50 శాతం చొప్పున నీటి పంపిణీకి బోర్డు నిర్ణయానికి వచ్చినట్లు మినిట్స్‌లో ఎలా పేర్కొంటారని అభ్యంతరం తెలిపింది. దీంతోపాటు పలు అంశాలను లేఖలో ఏపీ ప్రస్తావించినట్లు సమాచారం. కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలించాలని సూచించినట్లు కూడా తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని