చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
ఏలూరు జిల్లా చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు విద్యుత్తు లేదు. రోగులు నరకయాతన అనుభవించారు.
చింతలపూడి, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు విద్యుత్తు లేదు. రోగులు నరకయాతన అనుభవించారు. చీకటి ఆపై ఉక్కపోతతో చంటి పిల్లలు ఏడుస్తుంటే వారిని సముదాయించలేక తల్లులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. సెల్‌ఫోన్ వెలుగుల్లోనే సిబ్బంది సేవలందిస్తూ కనిపించారు. ఆసుపత్రిలో జనరేటర్ ఉన్నా ఫలితం లేదు. నిర్వహణకు నిధుల లేక ఒకటి రెండు గదులకు మాత్రమే దాంతో విద్యుత్తు ఇస్తున్నారు. వాటికీ కొద్దిసేపు మాత్రమే సరఫరా చేస్తున్నారని రోగులు తెలిపారు. కొన్ని రోజులుగా ఆసుపత్రిలో ఇదే పరిస్థితి అని, కరెంటు ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదని ఆవేదన చెందారు. రాత్రిపూట తరచూ సరఫరాలో అంతరాయం ఉంటోందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Floods: సిక్కింలో మెరుపు వరదలు.. 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
YSRCP: వైకాపా జిల్లా అధ్యక్షుల మార్పు
-
Vizag: ఫోర్జరీ సంతకాలతో ముదపాక భూముల విక్రయం
-
Rahul Gandhi: భారాస అంటే భాజపా రిస్తేదార్ సమితి: రాహుల్
-
TDP: ‘ఐప్యాక్‌కు రూ.274 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు’