చేప ప్రసాదం పంపిణీకి విశేష స్పందన

చేప ప్రసాదంతో ఆస్తమాతో పాటు అనారోగ్య సమస్యలు దూరమవుతాయన్న ప్రజల విశ్వాసాన్ని గౌరవిస్తూ ప్రభుత్వం రికార్డుస్థాయిలో ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.

Updated : 10 Jun 2023 05:49 IST

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, నాంపల్లి, అబిడ్స్‌: చేప ప్రసాదంతో ఆస్తమాతో పాటు అనారోగ్య సమస్యలు దూరమవుతాయన్న ప్రజల విశ్వాసాన్ని గౌరవిస్తూ ప్రభుత్వం రికార్డుస్థాయిలో ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. మృగశిరకార్తెను పురస్కరించుకొని బత్తిని కుటుంబీకులు ఇచ్చే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 8 గంటలకు ఆయన నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో లాంఛనంగా ప్రారంభించారు. మూడేళ్ల తర్వాత ఈ ప్రసాదం పంపిణీ చేపట్టడంతో.. గురువారం రాత్రి నుంచే జనాలు క్యూలైన్లలో ఉన్నారు. ఉదయం 8 గంటలకు పంపిణీ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటల వరకు 61,250 మంది ప్రసాదం తీసుకున్నట్లు మత్స్యశాఖ కమిషనర్‌ లచ్చిరాం భూక్య, అడిషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌రాథోడ్‌లు వెల్లడించారు. ఈసారి 2 లక్షల చేప పిల్లలను సిద్ధం చేశామని, రద్దీకి అనుగుణంగా శనివారం మరిన్ని చేప పిల్లలను సమకూరుస్తామని తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు