Andhra News: కళ్లజోళ్లూ ఇవ్వలేరా?ముద్దు పెడుతూ.. పలకరిస్తే సరిపోతుందా?
ముఖ్యమంత్రి జగన్ అవ్వా, తాతలపై ఒలకపోస్తున్న మమకారం మాత్రం చేతల్లో కనిపించడం లేదు. కంటి వెలుగు పథకం ద్వారా వారికి కళ్లజోళ్లు ఇచ్చి కొత్త ప్రపంచాన్ని చూపిస్తామని ఆర్భాటంగా ఆయన ప్రకటించారు.
మాపై కనికరం లేదా?
ఒకరికి రూ.160 కూడా ఖర్చు పెట్టలేరా?
సీఎం జగన్‌కు 3 లక్షల మంది అవ్వా, తాతల వేడుకోలు
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్ అవ్వా, తాతలపై ఒలకపోస్తున్న మమకారం మాత్రం చేతల్లో కనిపించడం లేదు. కంటి వెలుగు పథకం ద్వారా వారికి కళ్లజోళ్లు ఇచ్చి కొత్త ప్రపంచాన్ని చూపిస్తామని ఆర్భాటంగా ఆయన ప్రకటించారు. నెలలు గడిచిపోతున్నా... రాని కళ్లజోళ్ల కోసం నిరీక్షించాలో... తడుముకుంటూ ఎంతకాలం పనులు చేసుకోవాలో.. కొత్త వాటిని కొనుక్కోవాలో వద్దో.. తెలియని పరిస్థితుల్లో ఉన్నామని అవ్వా, తాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నాడు-నేడు, ఇతర అభివృద్ధి పథకాలను రూ.16 వేల కోట్లతో అమలు చేస్తున్నామని గొప్పగా చెప్పే ముఖ్యమంత్రి జగన్ కేవలం రూ.160లను ఒక కళ్లజోడుకు ఖర్చు పెట్టేందుకు ఎందుకు వెనుకాడుతున్నారో? సమస్య తీవ్రత గురించి తెలిసినా ఎందుకు పట్టించుకోవడం లేదోనని వారు ప్రశ్నిస్తున్నారు.
అస్తవ్యస్తంగా పంపిణీ
రాష్ట్రంలో కంటి-వెలుగు పథకం అమలు తొలి నుంచీ గందరగోళంగానే ఉంది. ముఖ్యంగా అవ్వా, తాతలకు కళ్లజోళ్ల పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. పరీక్షలు జరిపి.. వెంటనే కళ్లజోళ్లు అందచేస్తామని చెప్పి నెలలు నడిచిపోతున్నా.. ఇవ్వడం లేదు. వాటి కోసం దాదాపు ఏడెనిమిది నెలల నుంచి అవ్వాతాతలు నిరీక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 సంవత్సరాల వయస్సు దాటిన మొత్తం 57 లక్షల మందిలో 35 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. 22 లక్షల మందికి చేయాల్సి ఉంది. ఇందులోభాగంగా 12 లక్షల కళ్లజోళ్ల సరఫరాకు అనుమతి ఇచ్చారు. అందులో మూడు లక్షల మందికి కళ్లజోళ్ల పంపిణీ జరగాల్సి ఉంది. వీరిలో 1.6 లక్షల మంది రాయలసీమలోనే ఉండడం గమనార్హం. కొందరు మూడు, నాలుగు నెలలుగా.. అన్నమయ్య, శ్రీ సత్యసాయి, వైయస్‌ఆర్ కడప జిల్లాలకు చెందిన వారైతే గత ఏడాది ఆగస్టు నుంచి ఎదురుచూస్తున్నారు.
చేతులెత్తేసిన ‘ఆక్రితి’
వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు అనుసరించి ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ వేర్వేరు టెండర్ల ద్వారా మూడు సంస్థలను ఎంపిక చేసింది. తొలి టెండరు ద్వారా కొవిడ్ ముందు ఎంపిక చేసిన ఆక్రితి సంస్థకు ఒక కళ్లజోడు పంపిణీకి రూ.67 ధరను ఖరారు చేశారు. చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పంపిణీ బాధ్యతను అప్పగించారు. కొన్నాళ్లు పంపిణీ చేసిన ఈ సంస్థ గత ఏడాది ఆగస్టు నుంచి ఆపేసింది. తొలి టెండరు ద్వారా ఖరారు చేసిన ధర ప్రకారం కళ్లజోళ్లను పంపిణీ చేయలేమని, ఇతర ఏజెన్సీలకు మాదిరిగానే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే చెల్లింపులు వెనువెంటనే జరగాలని, ఆలస్యంగా సరఫరా చేస్తే జరిమానా విధించే విషయంలో మినహాయింపు ఇవ్వాలని కోరింది. ముడిసరకుల ధరలు పెరిగినందున ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతోంది. మరో పక్క కొవిడ్ అనంతరం వైద్య ఆరోగ్య శాఖ జోన్ల వారీగా కళ్లజోళ్లను పంపిణీ చేసేందుకు మరో రెండు సంస్థలను ఎంపిక చేసింది. వీటికి రూ.145 నుంచి రూ.160 మధ్య చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆక్రితి సంస్థ కూడా ధరపెంచమని అడుగుతోంది. దీనిపై యంత్రాంగం ఏ నిర్ణయం తీసుకోలేకపోవడంతో కళ్లజోళ్ల పంపిణీ నిలిచిపోయింది. దాంతో అవ్వాతాతలకు నిరీక్షణ తప్పడం లేదన్న భావన వ్యక్తమవుతోంది. ఇదిలాఉండగా దాదాపు 80 వేల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
iPhone: ఐఫోన్ డెలివరీ ఆలస్యం.. కోపంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు
-
Defamation: కాంగ్రెస్ ఎంపీపై.. అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!
-
Revanth Reddy: కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయి: రేవంత్‌రెడ్డి
-
Suryakumar Yadav: ఇన్నాళ్లూ తికమక పడ్డా.. నా కొత్త పాత్రను ఇష్టపడుతున్నా: సూర్యకుమార్