వరికి మద్దతు ధర పెంచాలని కోరాం
రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా కేంద్రాన్ని వరికి మద్దతు ధర పెంచమని కోరిందని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ తెలిపారు.
‘ఈనాడు’ కథనానికి ప్రత్యేక కమిషనర్ స్పందన
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా కేంద్రాన్ని వరికి మద్దతు ధర పెంచమని కోరిందని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన వ్యవసాయ ఖర్చులు-ధరల కమిషన్ నివేదికలో వరి పండించడానికి ఎకరాకు రూ.32వేలు సాగు ఖర్చవుతుందని, క్వింటా ధాన్యం ఉత్పత్తికి రూ.2,084 పెట్టుబడి అవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ చెప్పిందని పేర్కొన్నారు. ‘ఈనాడు’లో శుక్రవారం ప్రచురితమైన ‘వరి రైతుకు మిగిలేదేంటి?’ కథనంపై ఆయన స్పందించారు. ‘ఖరీఫ్ పంట కాలానికి వరికి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.3,126కు పెంచమని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. కేంద్రం సాధారణ రకానికి రూ.2,183, గ్రేడ్-ఎ రకానికి రూ.2,203 ప్రకటించింది. 2022-23లో ఖరీఫ్, రబీ పంట కాలాల్లో వరి పంట మొత్తం సాధారణ విస్తీర్ణం 58లక్షల ఎకరాలు కాగా.. మూడో ముందస్తు అంచనాల ప్రకారం 54.85లక్షల ఎకరాలు సాగైంది’ అని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.