తిరుమలపై మళ్లీ కనిపించిన విమానం

తిరుమల పైనుంచి మళ్లీ విమానం వెళ్లింది. శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయ సమీపంలోని అన్నదాన భవనం పైనుంచి విమానం వెళ్లగా తితిదే భద్రతాధికారులు దాని వివరాలు తెలుసుకుంటున్నారు.

Updated : 10 Jun 2023 06:02 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల పైనుంచి మళ్లీ విమానం వెళ్లింది. శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయ సమీపంలోని అన్నదాన భవనం పైనుంచి విమానం వెళ్లగా తితిదే భద్రతాధికారులు దాని వివరాలు తెలుసుకుంటున్నారు. గురువారం కూడా తిరుమల గగనతలం పైనుంచి నాలుగు విమానాలు వెళ్లాయి. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమలపై ఎటువంటి విమానాలు వెళ్లకూడదు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంపై తితిదే భద్రతాధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

తితిదే ట్రస్టులకు రూ.5 కోట్ల విరాళం

తితిదేలోని వివిధ ట్రస్టులకు ఓ అజ్ఞాత భక్తుడు రూ.5 కోట్ల విరాళం అందించారు. శుక్రవారం తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డిని కలిసిన దాత ఆ మొత్తాన్ని వివిధ సేవా కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని