చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయడానికే కస్టడీ
ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబును విచారించేందుకు ‘పోలీసు కస్టడీ’కి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తరఫున సీనియర్ న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారం వాదించారు.
సీఐడీ పిటిషన్‌ను తోసిపుచ్చండి
ప్రతీకారం తీర్చుకోవడానికే చంద్రబాబును ఇరికించారు
ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాదుల వాదనలు
నేడు నిర్ణయం వెల్లడిస్తామన్న న్యాయాధికారి
ఈనాడు, అమరావతి: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబును విచారించేందుకు ‘పోలీసు కస్టడీ’కి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తరఫున సీనియర్ న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారం వాదించారు. అయిదు రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చాలని కోరారు. పోలీసు కస్టడీ పేరుతో విచారణ చేసి, ఆ వివరాలను ఎంపిక చేసుకున్న ఛానళ్ల ద్వారా ప్రచారం చేసి ప్రజల్లో చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయాలనే లక్ష్యంతో దర్యాప్తు సంస్థ వ్యవహరిస్తోందన్నారు.
చంద్రబాబును అరెస్టుచేసిన సీఐడీ.. కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేసిందన్నారు. ఆ వీడియోలను ఇప్పటికే ప్రచారం చేశారన్నారు. ఏళ్లతరబడి దర్యాప్తు చేస్తున్నామంటున్న సీఐడీ.. ఇప్పటికే సాక్ష్యాధారాలను సేకరించి ఉండాలని, ఆ ఆధారాలే లేకపోతే పిటిషనర్‌ను ఎందుకు అరెస్టుచేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఎలా చూసినా చంద్రబాబును పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. బుధవారం విచారణలో ఇరువైపు వాదనలు ముగిశాయి. పోలీసు కస్టడీ వ్యవహారంపై గురువారం ఉదయం 11, 11:30 సమయంలో నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఏసీబీ కోర్టు న్యాయాధికారి బి.సత్య వెంకట హిమబిందు ప్రకటించారు.
విచారిస్తే తప్పేముంది: అదనపు ఏజీ
సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రత్యేక పీపీ వివేకానంద వాదనలు వినిపించారు. అరెస్టు అనంతరం పూర్తిస్థాయిలో విచారించడానికి తగిన సమయం లేదన్నారు. పోలీసు కస్టడీలో విచారణ చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. విచారణకు సహకరించాలని ఇద్దరికి నోటీసు ఇస్తే విదేశాలకు వెళ్లిపోయారని, షెల్ కంపెనీలకు మళ్లించిన ప్రజాధనం ఎవరికి చేరింది అనేది ఇంకా తేల్చాల్సి ఉందని చెప్పారు. ఇది రూ.371 కోట్ల ప్రజాధనం వ్యవహారం అన్నారు. వాస్తవాలు వెలికితీయాలంటే పోలీసు కస్టడీలో విచారణ అవసరం అన్నారు. దర్యాప్తులో గ్యాప్‌లను వెలికితీసేందుకు పోలీసు కస్టడీ అవసరమని తెలిపారు. ఓసారి జ్యుడిషియల్ రిమాండు కోరామన్న కారణంతో పోలీసు కస్టడీ కోరకూడదనే నిబంధన లేదని గుర్తుచేశారు. ఏసీబీ కోర్టుకు విచారణ పరిధి లేదంటూనే మరోవైపు ఇక్కడే పిటిషన్లు దాఖలు చేస్తున్నారన్నారు. అరెస్టు చేశాక హెలికాప్టర్‌లో విజయవాడ తీసుకెళ్తామని చెబితే చంద్రబాబు నిరాకరించి, రోడ్డుమార్గానే వెళదామన్నారని తెలిపారు.
దర్యాప్తు అధికారి ఒక్కరోజులో ఆలోచనను మార్చుకున్నారు
చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపించారు. ‘చంద్రబాబును అరెస్టుచేసి 24 గంటల్లో కోర్టు ముందు హాజరుపరచాల్సిన దర్యాప్తు అధికారులు 36 గంటలు వారివద్దే ఉంచుకున్నారు. విచారణ వీడియోలను కొన్ని ఛానళ్లకు లీక్ చేశారు. ఆ వివరాలు ఇప్పటికీ ప్రజాబాహుళ్యంలో ఉన్నాయి. ఈ నెల 10న ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరుస్తూ జ్యుడిషియల్ రిమాండుకు ఆదేశించాలని కోరారు. ఒక్క రోజులో అలోచనను మార్చుకున్న దర్యాప్తు అధికారి 11వ తేదీన పోలీసు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఇలా ఒక్కరోజులోనే మాట మార్చడం వెనక దర్యాప్తు అధికారి దురుద్దేశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయడం కోసం పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టు అనుమతి కోరుతున్నారు. ఇప్పటికే సీఐడీ ప్రెస్‌మీట్లు పెట్టింది. చంద్రబాబును ప్రశ్నిస్తున్నట్లు వీడియోలను విడుదల చేసింది. ఇలాంటి చర్యలన్నింటికీ న్యాయస్థానానికి సీఐడీ సమాధానం చెప్పాలి. కోర్టుతో సీఐడీ ఆటలాడుతోంది.
రాత్రికి రాత్రే నిందితుల జాబితాలో చంద్రబాబు పేరు
ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా చంద్రబాబును ఈ కేసులో ఇరికించారు. ఆయన పాత్ర ఉంటే 2021 నుంచి దర్యాప్తు చేస్తున్నవారు ఒక్కసారైనా నోటీసు ఇవ్వలేదు, విచారణకు పిలవలేదు. రాత్రికి రాత్రే ఆయన పేరును నిందితుల జాబితాలో చేర్చి బస్సును చుట్టుముట్టి అరెస్టు చేశారు. ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా ఇదంతా చేస్తోంది. పలు కేసుల్లో చంద్రబాబును నిందితుడిగా చేరుస్తున్నారు. అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ఆమోదం లేకుండా చంద్రబాబుపై దర్యాప్తు చేయడానికి వీల్లేదు, అరెస్టు చేయడానికీ వీల్లేదు. సీఐడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది.
చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం లేదు
నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల విషయంలో 2021 డిసెంబరు 9న సీఐడీ పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసింది. ఇప్పటివరకు పలువురిని అరెస్టు చేసింది. వారు బెయిలు పొందారు. ఇప్పటివరకు నిందితులందరూ దర్యాప్తు సంస్థతోనే ఉన్నారు. దర్యాప్తునకు సహకరించారు. ఇప్పటి వరకు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా లేదు. అలాంటప్పుడు ఆయనను పోలీసు కస్టడీలో విచారించి తేల్చేదేముంటుంది?
యాంత్రిక ధోరణిలో కస్టడీకి ఇవ్వడానికి వీల్లేదు
యాంత్రిక ధోరణిలో పోలీసు కస్టడీకి ఇవ్వడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వార్థ ప్రయోజనాల కోసం న్యాయస్థానాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి చర్యలను న్యాయస్థానాలు కట్టడి చేయాలి. ఈ కేసులో పోలీసు కస్టడీకి ఎందుకివ్వాలో సీఐడీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోతోంది. కస్టడీ సూత్రాలకు లోబడి న్యాయస్థానం నిర్ణయించాలి. అంతేతప్ప ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకునే విషయంలో న్యాయస్థానం భాగస్వామి కాకూడదు.
ప్రశ్నించడం సీఐడీ హక్కేమీ కాదు
సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబును నిందితుడిగా చేర్చామని చెబుతున్న సీఐడీ.. ఇప్పుడెందుకు పోలీసు కస్టడీ కోరుతోంది? ప్రశ్నించేందుకు తమకు అప్పగించాలని సీఐడీ చెబుతోంది. ప్రశ్నించడం అనేది సీఐడీకి పుట్టుకతో వచ్చిన హక్కేమీ కాదు. షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారనేది 2021 నుంచి చేస్తున్న ఆరోపణ. అయినా ఇప్పటివరకూ ఈ వ్యవహారాన్ని తేల్చలేదు. దర్యాప్తులో తేడాలున్నాయి (గ్యాప్‌లు), వాటిని సరిదిద్దుకోవాలి కాబట్టి పోలీసు కస్టడీకి ఇవ్వాలని ఏఏజీ చెప్పడం హాస్యాస్పదం.
వీడియోలు లీక్ చేసి దర్యాప్తు అధికారి కోర్టుధిక్కరణకు పాల్పడ్డారు
న్యాయస్థానం సీఆర్‌పీసీ సెక్షన్ 167 నిబంధనల మేరకు ఓసారి జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించింది. అదే నిబంధన ఆధారంగా పోలీసు కస్టడీకి ఆదేశించలేదు. చంద్రబాబును విచారిస్తున్న వీడియోలను తీసి ప్రతిష్ఠను దిగజార్చడానికే పోలీసు కస్టడీ కోరుతున్నారు. దర్యాప్తు అధికారి ఇప్పటికే వీడియోలను లీకుచేసి కోర్టుధిక్కరణకు పాల్పడ్డారు. ఇలాంటి కేసులను వాస్తవానికి ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల ప్రత్యేక న్యాయస్థానం విచారించాలి. ఏసీబీ కోర్టుకు పరిధి లేదు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పోలీసు కస్టడీ పిటిషన్‌ను కొట్టేయండి’ అని సీనియర్ న్యాయవాదులు కోరారు.
వీడియోల లీక్‌పై ఏం సమాధానం చెబుతారు?
చంద్రబాబును ప్రశ్నిస్తున్న వీడియోలు బయటకు రావడంతో, దానికి ఏం సమాధానం చెబుతారని న్యాయాధికారి ప్రశ్నించారు. సీఐడీ ప్రత్యేక పీపీ వివేకానంద బదులిస్తూ అవి నిరాధార ఆరోపణలన్నారు. వీడియోలు తీసింది ఎవరనేది ప్రశ్నార్థకం అన్నారు. చంద్రబాబుతో పాటు కుటుంబసభ్యులు, హెల్పర్లు, న్యాయవాదులు ఉన్నారన్నారు. ఆ వాదనపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎంపిక చేసుకున్న వ్యక్తుల ద్వారా సీఐడీ వీడియోలు తీయించిందన్నారు. వీడియోలో ఎవరున్నారనే విషయాలను పెన్‌డ్రైవ్ ద్వారా కోర్టుకు అందజేస్తామన్నారు.
కాల్ రికార్డుల పిటిషన్‌పై కౌంటర్ వేయండి
చంద్రబాబును నంద్యాలలో అరెస్టుచేసిన సందర్భంగా సీఐడీ అధికారులు ఎవరితో మాట్లాడారు, సమాచారాన్ని ఎవరికి చేరవేశారో వెల్లడి కావాలంటే ఆ అధికారుల సెల్‌ఫోన్ కాల్ రికార్డులను భద్రపరచాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌లో కౌంటర్ వేయాలని సీఐడీని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 22న విచారణ చేస్తానన్నారు. మరోవైపు చంద్రబాబును ఇతర కేసుల్లో సీఐడీ నిందితుడిగా చేర్చి వాటిలో విచారించేందుకు అనుమతించాలని పీటీ వారంట్ దాఖలుచేసిన విషయం తెలిసిందే. వీటిపై గురువారం విచారణ చేస్తానని న్యాయాధికారి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలల కల్లోలం
మిగ్జాం తుపాను.. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిపిస్తూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అలజడి రేపుతోంది. చెన్నై నగరంతో పాటు.. తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఇప్పటికే వందల గ్రామాలు అతలాకుతలం అవుతున్నాయి. రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. -
ఏపీ కుత్తుకపై కత్తి.. ప్రశ్నించరేం గొంతెత్తి?
జగనన్నా... 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి అది సాధిస్తా.. ఇది తీసుకొస్తానంటూ బీరాలు పలికారు కదా... కేంద్రం మెడలు వంచైనా చెప్పింది చేస్తానని ఈ నాలుగున్నరేళ్లలో సాధించిందేంటి? ప్రధాని మోదీతో అంతా బాగుందని స్వయంగా ప్రకటించుకున్న మీరు... -
క్యాంప్ ఆఫీస్ ముసుగులో విశాఖకు తరలింపు
ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష ముసుగులో క్యాంప్ కార్యాలయాల పేరు చెప్పి విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు యత్నాలపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. -
వైకాపా పాలనలో దళితులపై దమనకాండ
తనను తాను దళిత, గిరిజన బాంధవుడిగా అభివర్ణించుకునే జగన్మోహన్రెడ్డి పాలనలో అణగారినవర్గాలపై దారుణ దమనకాండ కొనసాగుతోంది. ‘‘నా ఎస్సీ.. నా ఎస్టీ’’ అంటూ దళిత దీనజనోద్ధారకుడిలా ఊదరగొట్టే ఆయన హయాంలో వారానికి నలుగురు దళితులు దారుణ హత్యలకు గురవుతున్నారు. -
నేరాంధ్రప్రదేశ్!
-
తుపాన్లకు పేర్లు పెట్టేందుకూ ఓ విధానం
తీరం వైపు దూసుకొస్తున్న మిగ్జాం తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లను కుదిపేస్తోంది. రెండు రాష్ట్రాలను ఇంతగా వణికిస్తున్న ఈ తుపానుకు మిగ్జాం అనే పేరును మయన్మార్ సూచించింది. ఈ పేరుకు అర్థం.. బలం, పుంజుకునే శక్తి అని వెల్లడించింది. -
పీఎంఆర్పీవై కింద రూ.228.10 కోట్ల పంపిణీ
ప్రధానమంత్రి రోజ్‌గార్ ప్రోత్సాహన్ యోజన (పీఎంఆర్పీవై) కింద ఆంధ్రప్రదేశ్‌కు 2016-17 నుంచి 2021-22 వరకు రూ.228.10 కోట్లను సబ్సిడీ కింద పంపిణీ చేసినట్లు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. -
‘గుండె’ గోడు వినపడదా..?
తాను పుట్టిందే పేదల్ని ఉద్ధరించడానికి అన్నట్లు స్వయంగా గొప్పలు చెప్పుకొంటారు. అవకాశం చిక్కితే చాలు సమయం, సందర్భమూ చూడకుండా పేదలు, పెత్తందారులంటూ రాగాలు తీస్తారు. ఆయన ఒక్కరే పేదల పక్షమన్నట్లు, మిగతా వారంతా పెత్తందారులు అన్నట్లు విరుచుకుపడతారు... -
తుపాను సన్నద్ధత ఇదా?
తుపాను విరుచుకు పడుతుందని తెలిస్తే.. ఏ ప్రభుత్వమైనా వారం ముందు నుంచే సహాయ చర్యలపై దృష్టిసారిస్తుంది. పంట నష్టాన్ని తగ్గించడంపై శ్రద్ధ పెడుతుంది. ఘనత వహించిన వైకాపా సర్కారుకు మాత్రం.. తీరం దాటడానికి ఒకటి, రెండు రోజుల ముందే రైతులు గుర్తొస్తారు. -
పునరావాస శిబిరాల్లో ఎలాంటి లోటూ రాకూడదు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని వారిని పునరావాస శిబిరాలకు తరలించి, అన్ని సౌకర్యాలూ కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. కోసిన పంటను, రంగు మారిన ధాన్యాన్ని కూడా యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలని చెప్పారు. ఖరీఫ్ పంటల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు
తీవ్ర తుపాను ‘మిగ్జాం’ తీరానికి సమాంతరంగా కదులుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో గాలుల తీవ్రత పెరిగిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. తీరానికి చేరువలోకి వచ్చేసరికి 90-112 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయన్నారు. -
అన్నదాతల్లో తుపాను కలవరం
తుపాను తీరానికి దగ్గరయ్యే కొద్దీ రైతుల్లో ఆందోళన అధికమవుతోంది. ఈదురుగాలుల ధాటికి కోతకు సిద్ధంగా ఉన్న లక్షల ఎకరాల్లో వరి.. నేలవాలుతోంది. వర్షాలు, గాలుల తీవ్రత పెరిగితే చేతికి దక్కదేమో అనే భయం వారిని వెన్నాడుతోంది. -
పట్టుబట్టి.. పేదల పొట్టకొట్టి..!
యువతకు ఉపాధినిచ్చే పరిశ్రమలైనా.. అట్టడుగు వర్గాలకు అండగా నిలిచే ప్రత్యేక పథకాలైనా.. పాలనా సౌకర్యం కోసం నిర్మించుకున్న ప్రజావేదికైనా.. ఆఖరికి పేదల కడుపు నింపే ‘అన్న క్యాంటీన్’ అయినా.. ఏదైనా సరే.. కూలిపోవడమో.. తరలిపోవడమో.. -
పేరులో చిన్న.. సెటిల్మెంట్లలో ‘పెద్ద’
‘యథా రాజా తథా ప్రజా’... ఈ మాటల్ని ‘యథా బడా నేత తథా ఛోటా నేత’గా అన్వయించుకుంటున్నారు వైకాపా నాయకులు. జగన్ సీఎం అయ్యాక ఇదివరకెన్నడూ లేనంతగా సెటిల్మెంట్లు, బెదిరింపుల సంస్కృతి జిల్లాలకూ పాకింది. వివాదం అని తెలిస్తే చాలు... -
తిరుమలలో వర్షాలు
తుపాను ప్రభావంతో తిరుమలలో కురుస్తున్న వర్షాలు, పొగమంచుతో భక్తులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సోమవారం శ్రీవారి దర్శనానికి వచ్చిన తిరుపతికి చెందిన భక్తుడు విజయ్‌కుమార్ జారి కిందపడటంతో కాలు విరిగింది. -
ఛార్టర్డ్ అకౌంటెంట్ వృత్తికి మచ్చ తెచ్చిన విజయసాయిరెడ్డి
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఛార్టర్డ్ అకౌంటెంట్‌గా వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) క్రమశిక్షణ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. -
ఇప్పటికైనా మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి: అమరావతి రైతులు
రాష్ట్ర రాజధాని అమరావతిగా కేంద్రం మరోసారి పేర్కొందని, ఇప్పటికైనా సీఎం జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అమరావతి అన్నదాతలు కోరారు. -
7 గంటల్లోనే ఆర్యూబీ నిర్మాణం
విశాఖ-విజయనగరం రైలు మార్గంలో కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద 477 రైల్వే లెవెల్ క్రాసింగ్ (గేటు) స్థానంలో రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణాన్ని కేవలం ఏడు గంటల్లో పూర్తిచేశారు. -
మరుగుదొడ్లకు తలుపులు లేవ్
‘మరుగుదొడ్లకు తలుపులు లేవు. కరెంటు లేకపోతే నీళ్లు రావు. దీని గురించి ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదు. లేనిపోని నిబంధనలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. -
వ్యాపార రిజిస్ట్రేషన్లకు సేవాకేంద్రాలు
రాష్ట్రంలో వ్యాపారులు వస్తు సేవల పన్నుకు (జీఎస్టీ) సంబంధించిన రిజిస్ట్రేషన్లు, పన్నులు చెల్లించడాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేక సేవాకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి తెలిపారు. గుజరాత్, పాండిచ్చేరితోపాటు ఏపీలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ జీఎస్టీ సేవా కేంద్రాలను నెలకొల్పామని మంత్రి వెల్లడించారు. -
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. దాని మాస్టర్‌ప్లాన్‌కు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించింది. ‘పట్టణ పరిపాలన, నగరాల దీర్ఘకాల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ అత్యవసరం.