Eluru: చేపల చెరువు కాదు.. రహదారే!

ఏలూరు జిల్లా మండవల్లి మండలం చింతపాడు రహదారి అధ్వానంగా మారింది. ఈ దారిలో అడుగడుగునా గోతులే కనిపిస్తాయి.

Updated : 23 Sep 2023 07:28 IST

ఏలూరు జిల్లా మండవల్లి మండలం చింతపాడు రహదారి అధ్వానంగా మారింది. ఈ దారిలో అడుగడుగునా గోతులే కనిపిస్తాయి. ఈ మార్గంలో ఆక్వా ఉత్పత్తుల వాహనాలు వెళ్తుంటే.. కుదుపులకు వాటిలోంచి చేపలు ఎగిరి రోడ్డుపై పడుతున్నాయి. వర్షం వచ్చిందంటే గ్రామస్థులు అడుగు బయటపెట్టేందుకు భయపడుతున్నారు. ఏ గొయ్యి ఎంత లోతు ఉందో అర్థంకాక ప్రమాదాలకు గురవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఏలూరు నుంచి కైకలూరు, ఆకివీడు, భీమవరం, నరసాపురం వెళ్లే బస్సులన్నీ ఇటు నుంచే రాకపోకలు సాగిస్తుంటాయి. గత నాలుగేళ్లలో ఈ రోడ్డును ఒక్కసారే మరమ్మతు చేశారు.

ఈనాడు, ఏలూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని