ఆర్టీఐ దరఖాస్తులను త్వరితంగా పరిష్కరించాలి

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తులను త్వరితంగా పరిష్కరించడానికి పౌర సమాచార అధికారులకు, మొదటి అప్పీలేట్‌ అధికారులకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటుచేయాలని రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్‌ ఉల్చాల హరిప్రసాదరెడ్డి ఆదేశించారు.

Published : 23 Sep 2023 06:00 IST

స.హ. కమిషనర్‌ ఉల్చాల హరిప్రసాదరెడ్డి

ఈనాడు, అమరావతి: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తులను త్వరితంగా పరిష్కరించడానికి పౌర సమాచార అధికారులకు, మొదటి అప్పీలేట్‌ అధికారులకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటుచేయాలని రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్‌ ఉల్చాల హరిప్రసాదరెడ్డి ఆదేశించారు. సమాచార హక్కుపై వ్యవసాయశాఖ అధికారులకు అవగాహన కల్పించేందుకు విజయవాడలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పౌరులు అడిగిన సమాచారం సకాలంలో అందించాలంటే దస్త్రాల నిర్వహణ మెరుగ్గా ఉండాలి. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ అవసరం. అడిగిన సమాచారమివ్వడానికి వీలుపడని సందర్భాల్లో అందుకు దారి తీసిన హేతుబద్ధమైన కారణాలను దరఖాస్తుదారుకు సకాలంలో వివరించాలి. ఆర్టీఐతో అన్ని ప్రభుత్వ విభాగాలూ సంపూర్ణ స్నేహబంధం కలిగి ఉండాలి’ అని హరిప్రసాదరెడ్డి సూచించారు. సమావేశంలో వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ చేవూరి హరికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని