కలుషితాహారం తిని అంగన్‌వాడీ విద్యార్థులకు అస్వస్థత

కలుషితాహారం తిని ఆరుగురు చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన తిరుపతి జిల్లా వడమాలపేట మండలం బంగారెడ్డికండ్రి అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం జరిగింది.

Published : 24 Sep 2023 05:16 IST

వడమాలపేట, న్యూస్‌టుడే: కలుషితాహారం తిని ఆరుగురు చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన తిరుపతి జిల్లా వడమాలపేట మండలం బంగారెడ్డికండ్రి అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం జరిగింది. తల్లిదండ్రుల కథనం మేరకు.. మధ్యాహ్న భోజనం సమయంలో చిన్నారులకు ఆహారంగా వెజ్‌ బిర్యానీ, కోడిగుడ్డు, పాలు అందజేశారు. వాటిని తిన్న కొద్ది సేపటికే హర్షవర్ధన్‌, బాలరాజు, అను, జస్మిత, పూర్ణేశ్‌, గుణశేఖర్‌ అనే విద్యార్థులకు వాంతులయ్యాయి. వెంటనే అంగన్‌వాడీ టీచర్‌ నీరజ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తీసుకొచ్చారు. వీరిలో పూర్ణేశ్‌, జస్మితను సమీపానే ఉన్న రామచంద్రాపురం మండలంలోని కుప్పంబాదూరు పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చే పాలు, గుడ్లు నాణ్యతగా ఉండటం లేదని, దీనివల్లే పిల్లలకు వాంతులు, విరోచనాలు అయ్యాయని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఇదిలా ఉండగా.. గ్రామంలో వినాయకుడి విగ్రహం వద్ద ముందురోజు పెట్టిన ప్రసాదం తినడం వల్లే పిల్లలకు ఇలా జరిగిందని, అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చిన ఆహారం నాణ్యమైనదేనని అధికారులు పేర్కొనడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని