తెదేపా ర్యాలీలో ఉద్రిక్తత

విశాఖ ఆరిలోవ నియోజకవర్గంలో తెదేపా నేతలు శనివారం రాత్రి చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది.

Published : 24 Sep 2023 05:16 IST

మహిళలను నెట్టివేసిన పోలీసులు

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ ఆరిలోవ నియోజకవర్గంలో తెదేపా నేతలు శనివారం రాత్రి చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే రామకృష్ణబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టగా అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. అనుమతి లేకుండా ర్యాలీ చేయకూడదని ఎమ్మెల్యే, ఇతర నాయకులతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ ముందుకెళ్తున్న మహిళలను పోలీసులు లాఠీలను అడ్డుపెట్టి నెట్టడంతో కొందరు కిందపడ్డారు. ఓ మహిళకు గాయమైంది. పురుష పోలీసులు మహిళలను నెట్టడం ఏమిటని వారు ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని