ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తాలి: బాలకృష్ణ

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి తెదేపా గళం వినిపించాలని తెలుగు మహిళలకు ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచించారు.

Published : 24 Sep 2023 05:36 IST

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, టి.నగర్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి తెదేపా గళం వినిపించాలని తెలుగు మహిళలకు ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచించారు. రాజమహేంద్రవరంలో చంద్రబాబు కుటుంబసభ్యులు బస చేసిన ప్రాంతానికి వచ్చిన మహిళలు, నాయకులతో బాలకృష్ణ కాసేపు మాట్లాడారు.

25 వరకు ప్రత్యేక వైద్య బృందం

రాజమహేంద్రవరం వైద్యం: చంద్రబాబుకు వీవీఐపీ కేటగిరీలో భాగంగా ఏర్పాటుచేసిన వైద్య బృందం సేవలు ఈ నెల 25 వరకు పొడిగిస్తూ రాజమహేంద్రవరం జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీసూర్యప్రభ శనివారం ఉత్తర్వులిచ్చారు. 9 మందితో కూడిన వైద్యసిబ్బంది అందుబాటులో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని