అఖిలప్రియ దీక్ష భగ్నం

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నంద్యాలలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేపట్టిన నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

Published : 24 Sep 2023 05:36 IST

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నంద్యాలలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేపట్టిన నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శనివారం వేకువ జామున 3.55 గంటలకు అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌ రామ్‌ నాయుడు, సోదరుడు భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డిని ఒకే వాహనంలో ఆళ్లగడ్డలోని వారి నివాసానికి తరలించారు. ఈ క్రమంలో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. అంతకుముందు అఖిలప్రియ, జగత్‌ విఖ్యాత్‌రెడ్డిలను ఆళ్లగడ్డ సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులు వారిని సముదాయించి నివాసానికి తరలించారు. అన్ని అనుమతులతో నిరాహార దీక్ష చేస్తున్న తనను మహిళ అని కూడా చూడకుండా పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేయడమేంటని భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై తాను చట్ట ప్రకారం ముందుకెళ్తానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని