Vizag: రుషికొండపై చకచకా పనులు.. కేసులున్నా వెనక్కి తగ్గకుండా..

విశాఖలోని రుషికొండపై పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు పేరుతో సాగుతున్న నిర్మాణాలపై కేసులున్నా... అధికార యంత్రాంగం వెనక్కి తగ్గడం లేదు.

Updated : 24 Sep 2023 09:51 IST

ఈనాడు, విశాఖపట్నం: విశాఖలోని రుషికొండపై పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు పేరుతో సాగుతున్న నిర్మాణాలపై కేసులున్నా... అధికార యంత్రాంగం వెనక్కి తగ్గడం లేదు. ఎన్నో వివాదాలు నెలకొన్న ఈ ప్రాజెక్టులో నిబంధనల ఉల్లంఘనలూ బయటపడ్డాయి. అయినా సరే పనులు చకచకా చేసేస్తున్నారు. విశాఖ నుంచి పాలన కొనసాగిస్తామంటున్న వైకాపా నేతల ప్రకటనలకు అనుగుణంగా, సీఎం నివాస సముదాయమిదే అన్న రీతిలో రుషికొండపై భవనాలను తీర్చిదిద్దుతున్నారనే అంశం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే భవనాల దగ్గర రహదారి పనులు ఆరంభించారు. మరోవైపు విశాఖ నుంచి భీమిలి వెళ్లే బీచ్‌రోడ్డును కొన్నిచోట్ల విస్తరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు