న్యాయపరమైన చిక్కులున్నా విశాఖ నుంచే పాలన: మంత్రి అమర్‌నాథ్‌

విశాఖకు పరిపాలన రాజధాని తరలింపు విషయంలో న్యాయపరమైన చిక్కులున్నప్పటికీ సీఎం ఎక్కడి నుంచైనా పాలన సాగించవచ్చుననే నిబంధన ఆధారంగా దసరా రోజున విశాఖ నుంచి పరిపాలనను ప్రారంభించనున్నారని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు.

Published : 24 Sep 2023 05:36 IST

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: విశాఖకు పరిపాలన రాజధాని తరలింపు విషయంలో న్యాయపరమైన చిక్కులున్నప్పటికీ సీఎం ఎక్కడి నుంచైనా పాలన సాగించవచ్చుననే నిబంధన ఆధారంగా దసరా రోజున విశాఖ నుంచి పరిపాలనను ప్రారంభించనున్నారని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. విశాఖ గవర్నర్‌ బంగ్లాలో నాన్‌ పొలిటికల్‌ ఐకాస సమావేశం.. కన్వీనర్‌ ప్రొఫెసర్‌ లజపతిరాజ్‌ అధ్యక్షతన శనివారం జరిగింది. మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడుతూ... సీఎం విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయాన్ని పొలిటికల్‌ ఐకాస స్వాగతించిందన్నారు. వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... మూడు రాజధానుల విషయంలో సీఎం స్పష్టమైన వైఖరితో ఉన్నారని చెప్పారు. విశాఖ మేయరు గొలగాని హరి వెంకటకుమారి, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని