బృహత్తర ప్రణాళికతో విశాఖను అభివృద్ధి

విశాఖ నగర అభివృద్ధికి... భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని బృహత్తర ప్రణాళికతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) కేఎస్‌ జవహర్‌రెడ్డి జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Updated : 24 Sep 2023 06:35 IST

సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ నగర అభివృద్ధికి... భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని బృహత్తర ప్రణాళికతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) కేఎస్‌ జవహర్‌రెడ్డి జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ) పరిధిలోని మూడు జిల్లాల్లో రూ.కోట్లతో చేపట్టే ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులపై శనివారం జిల్లా అధికారులతో వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో ఆయన సమీక్షించారు. విశాఖలో చేపట్టే ప్రాజెక్టులతో నగర రూపురేఖలు మారతాయని, అభివృద్ధి పనుల్లో పచ్చదనం, పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. బీచ్‌ కారిడార్లో భాగంగా కాపులుప్పాడలో సిగ్నేచర్‌ టవర్‌, ఆధునిక వసతులతో కూడిన కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించాలని జవహర్‌రెడ్డి సూచించారు. మంగమారిపేట వద్ద జల క్రీడలు,   కైలాసగిరిపైన సైన్స్‌ సిటీతో పాటు నగరంలోని అన్ని ఉద్యానవనాలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. అర్ధ చంద్రాకారంలో విశాఖ నగరాన్ని అనుసంధానించే రింగురోడ్డును నిర్మించాలన్నారు.

  • సమీక్ష అనంతరం సీఎస్‌ తిరిగి వెళ్తూ విలేకరులతో మాట్లాడారు. ‘నీతిఆయోగ్‌ ఎంపిక చేసిన నగరాల్లో విశాఖ ఉండటంతో అందుకు సంబంధించిన ప్రణాళికలపై చర్చించా’ అని పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా సీఎం పాలన సాగించనున్నందున ఆయన నివాసం, ఇతర అంశాలపై సమీక్షించారా? అని ఓ విలేకరి అడగ్గా ‘అవన్నీ త్వరలో జరగబోతున్నాయి. మీరు చూస్తారు’ అంటూ సమాధానమిచ్చారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు