శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచానికి సేవలందించాలి

వినూత్న ఆవిష్కరణలు, శాస్త్ర సాంకేతిక విద్యలో నైపుణ్యాలను పెంపొందించుకొని ప్రపంచ మానవాళికి సేవలందించాలని రిటైర్డ్‌ జడ్జి, రాష్ట్ర జ్యుడిషియల్‌ ప్రివ్యూ కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ బి.శివశంకరరావు విద్యార్థులకు సూచించారు.

Published : 24 Sep 2023 05:36 IST

విద్యార్థులతో జస్టిస్‌ బి.శివశంకరరావు
వేడుకగా విట్‌-ఏపీ యూనివర్సిటీ స్నాతకోత్సవం

తుళ్లూరు, న్యూస్‌టుడే: వినూత్న ఆవిష్కరణలు, శాస్త్ర సాంకేతిక విద్యలో నైపుణ్యాలను పెంపొందించుకొని ప్రపంచ మానవాళికి సేవలందించాలని రిటైర్డ్‌ జడ్జి, రాష్ట్ర జ్యుడిషియల్‌ ప్రివ్యూ కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ బి.శివశంకరరావు విద్యార్థులకు సూచించారు. అమరావతిలోని విట్‌-ఏపీ విశ్వవిద్యాలయంలో శనివారం మూడో స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జస్టిస్‌ శివశంకరరావు పాల్గొన్నారు. గౌరవ అతిథిగా మైక్రోసాఫ్ట్‌ బెంగళూరు శాఖ డైరెక్టర్‌ ఆశిష్‌శర్మ విచ్చేశారు. విట్‌ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌, వ్యవస్థాపకుడు జి.విశ్వనాథన్‌ ఆధ్వర్యంలో స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్‌ శివశంకరరావు మాట్లాడుతూ... నిరంతర శ్రమ, అంకితభావంతో పనిచేసే విద్యార్థులు.. సవాళ్లు, సమస్యలను పరిష్కరించుకొంటూ విజయాలకు బాటలు వేసుకొని అభివృద్ధి చెందుతారన్నారు. స్నాతకోత్సవం ముగింపు కాదని, నిరంతర అభ్యాసానికి నాంది అన్నారు. విశ్వనాథన్‌ మాట్లాడుతూ... అకడమిక్‌ ఎక్సలెన్స్‌ను పెంపొందించటం, భవిష్యత్తు నాయకులుగా విద్యార్థులను తీర్చిదిద్దటంలో విట్‌ అంకితభావంతో పని చేస్తోందన్నారు. 2023 బ్యాచ్‌ విద్యార్థులు ప్రదర్శించిన కృషి, సంకల్పం, స్థితిస్థాపకతకు స్నాతకోత్సవం నిదర్శనంగా నిలుస్తుందన్నారు. అనంతరం 1,611 మంది పట్టభద్రులకు డిగ్రీ పట్టాలు, 16 మందికి బంగారు పతకాలు, ఉన్నత ర్యాంకులు సాధించిన 70 మంది విద్యార్థులకు ప్రశంస పత్రాలను ముఖ్యఅతిథులతో కలిసి అందించారు. 34 మందికి పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేశారు. విట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ శంకర్‌విశ్వనాథన్‌, వైస్‌ ఛాన్సలర్‌ ఎస్‌.వి.కోటారెడ్డి, రిజిస్ట్రార్‌ జగదీష్‌చంద్ర ముదిగంటి, అకడమిక్‌ డీన్‌లు మధుసూదనరావు, డిప్యూటీ డైరెక్టర్‌ స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ ఖాదిర్‌ బాషా, విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు