హాస్టల్‌ను అద్దె భవనంలోకి తరలిస్తాం

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని ఎస్సీ వసతి గృహం కోసం అద్దె భవనం తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Published : 24 Sep 2023 05:36 IST

చాగల్లు, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని ఎస్సీ వసతి గృహం కోసం అద్దె భవనం తీసుకుంటామని అధికారులు తెలిపారు. హాస్టల్‌ భవనం అధ్వానంగా మారడంతో విద్యార్థులు పక్కనే ఉన్న పాఠశాలలో పడుకుంటున్నారని శనివారం ‘ఈనాడు’లో చిత్రవార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై వివిధ శాఖల అధికారులు స్పందించి వసతి గృహాన్ని పరిశీలించారు. జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారిక అధికారి సందీప్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత భవనం నివాసయోగ్యం కాదని 2020లోనే ఇంజినీరింగ్‌ విభాగం గుర్తించిందని, అప్పటి నుంచి అద్దె భవనం కోసం చూసినా లభ్యం కాలేదన్నారు. త్వరలో అద్దె భవనంలోకి మార్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. తిరిగి ఆయన రాత్రి సమయంలో హాస్టల్‌కు వచ్చి, విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం వారితో కొంతసేపు మాట్లాడారు. ఎంపీడీవో సుశీల, ఏఎస్‌డబ్ల్యూవో మేరీమాత, వార్డెన్‌ రాజు ఆయన వెంట ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని