ప్రస్తుత చట్టాల రద్దు తగదు

ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కొత్తవాటిని రూపొందించడం తగదని ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌(ఐలు) జాతీయ అధ్యక్షుడు, ఎంపీ వికాస్‌ రంజన్‌ భట్టాచార్య పేర్కొన్నారు.

Published : 24 Sep 2023 05:36 IST

ఐలు జాతీయ అధ్యక్షుడు వికాస్‌రంజన్‌ భట్టాచార్య 

విజయవాడ(భవానీపురం), న్యూస్‌టుడే: ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కొత్తవాటిని రూపొందించడం తగదని ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌(ఐలు) జాతీయ అధ్యక్షుడు, ఎంపీ వికాస్‌ రంజన్‌ భట్టాచార్య పేర్కొన్నారు. ఐలు జాతీయ కౌన్సిల్‌ సమావేశాన్ని విజయవాడలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస్‌ రంజన్‌ భట్టాచార్య మాట్లాడుతూ పాత చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లులను ప్రవేశపెట్టడం అంటే విలువైన మానవ వనరులను వృథా చేయడమేనన్నారు. ఇది న్యాయ సౌభ్రాతృత్వానికి, దేశ ప్రజలకు తీవ్ర అపచారమని పేర్కొన్నారు. ఐలు ఏపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ ఏడాది డిసెంబరు 28, 29, 30 తేదీల్లో కోల్‌కతాలో ఆలిండియా మహాసభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని, యూనిఫాం సివిల్‌ కోడ్‌ అవసరం లేదని సమావేశంలో తీర్మానించినట్లు చెప్పారు. సమావేశంలో కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు, సీనియర్‌ న్యాయవాది పి.వి.సురేంద్రనాథ్‌, చౌహాన్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని