కాలవ శ్రీనివాసులు దీక్ష భగ్నం

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను శనివారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో పోలీసులు భగ్నం చేశారు.

Published : 24 Sep 2023 06:01 IST

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను శనివారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో పోలీసులు భగ్నం చేశారు. ఆయనను బలవంతంగా స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ సమయంలో పోలీసులు, తెదేపా నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రాథమిక వైద్యపరీక్షల అనంతరం మెరుగైన వైద్యం కోసం కాలవ శ్రీనివాసులును అనంతపురం తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని