చంద్రబాబు అరెస్టుకు నిరసనగా విదేశాల్లో ఆందోళనలు

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా వివిధ దేశాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Published : 24 Sep 2023 05:36 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి : తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా వివిధ దేశాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబును తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ అక్కడి తెలుగువారు, ఐటీ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం బహ్రెయిన్‌లో ప్రవాసాంధ్రులు నిరసన తెలిపారు. ‘చంద్రబాబును రిమాండ్‌లో ఉంచడం అన్యాయం, చంద్రబాబు అంటేనే అభివృద్ధి..సంక్షేమం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘సైకో పోవాలి..సైకిల్‌ రావాలి’ అని ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. కువైట్‌లో ఎన్నారై తెదేపా, జనసేన సమాఖ్యల సంయుక్త ఆధ్వర్యంలో ‘వియ్‌ స్టాండ్‌ విత్‌ సీబీఎన్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

  •  పశ్చిమ ఆఫ్రికాలోని టాంజానియా దేశ ఆర్థిక రాజధాని దార్‌ ఎస్‌ సలాంలో అక్కడి తెలుగువారు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుపై అక్రమకేసులు బనాయించి జైలుకు పంపారని ధ్వజమెత్తారు. ‘వీ స్టాండ్‌ విత్‌ సీబీఎన్‌’ అని ఉన్న ఫ్లెక్సీ ధరించి శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు విడుదలయ్యే వరకు ఆయనకు మద్దతుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని