Chandrababu: ‘బాబుతో నేను’.. చంద్రబాబుకు మద్దతుగా ఉత్తరాల ప్రవాహం

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ‘బాబుతో నేను’ పేరుతో కేంద్ర కారాగారానికి పోస్టు కార్డులు వస్తున్నాయి.

Updated : 24 Sep 2023 07:44 IST

దేవీచౌక్‌(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ‘బాబుతో నేను’ పేరుతో కేంద్ర కారాగారానికి పోస్టు కార్డులు వస్తున్నాయి. ఈ నెల 16 నుంచి ఈ పోస్టుకార్డుల ఉద్యమం కొనసాగుతుండగా రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. గత నాలుగు రోజులుగా వేల సంఖ్యలో పోస్టు కార్డులు పోటెత్తుతున్నాయి. ఈ నెల 20న 2,150, 21న 6,250, 22న 8,340 కార్డులు, శనివారం అత్యధికంగా 23,570 కార్డులు పంపారు. ఇవి కాకుండా గత నాలుగు రోజుల్లో 60కి పైగా స్పీడ్‌ పోస్టు, సుమారు 90 దాకా రిజిస్టర్డ్‌ పోస్టు, 300 వరకు ఆర్డినరీ పోస్టులో చంద్రబాబుకు అభిమానులు లేఖలు పంపడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని