సీఎం ఇలాకాలో భారీ భూ కుంభకోణం
ముఖ్యమంత్రి జగన్ ఇలాకా పులివెందులలో భారీ భూకుంభకోణం వెలుగు చూసింది. రూ.100 కోట్ల విలువైన చుక్కల భూములకు నకిలీ నిరభ్యంతర పత్రాల (ఎన్వోసీ)తో రిజిస్ట్రేషన్లు జరిగాయి.
జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ
నకిలీ ఎన్వోసీలతో రిజిస్ట్రేషన్లు
పులివెందుల, కడప రెవెన్యూ అధికారుల పాత్ర
స్థిరాస్తి దళారీపై పోలీసులకు ఫిర్యాదు
కేసు నమోదులో తాత్సారంపై విమర్శలు
ఈనాడు, కడప: ముఖ్యమంత్రి జగన్ ఇలాకా పులివెందులలో భారీ భూకుంభకోణం వెలుగు చూసింది. రూ.100 కోట్ల విలువైన చుక్కల భూములకు నకిలీ నిరభ్యంతర పత్రాల (ఎన్వోసీ)తో రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ అక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, రెవెన్యూ శాఖలో కొందరు అధికారుల పాత్ర ఉన్నట్లు తేలింది. ముఖ్యమంత్రి ఇలాకా పులివెందులలో అక్రమం వెలుగులోకి రావడం సంచలనం కలిగిస్తోంది. ఈ దందా జిల్లా కలెక్టర్ విజయరామరాజు దృష్టికి వెళ్లింది. తన సంతకం ఫోర్జరీ చేయడంతో పాటు తన అనుమతి లేకుండా ఎన్వోసీలు జారీ కావడాన్ని గుర్తించారు. ఈ మేరకు ప్రాథమిక విచారణలో 12 ఎన్వోసీలతో 35 ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించారు. వీటిని వెంటనే రద్దు చేయాలంటూ పులివెందుల తహసీల్దార్ కల్లూరి మాధవ కృష్ణారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు.
సీఎం సమీప బంధువులూ బాధితులే
పులివెందులకు చెందిన పత్తి నాగేశ్వరరావుకు కె.వెలమవారిపల్లె గ్రామం సర్వే నంబరు 99/3లో ఉన్న 2.98 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన రిజిస్ట్రేషన్ల రద్దుకు ప్రక్రియ నడుస్తోంది. ఈ అక్రమంపై పోలీసులకు ఆర్డీవో వెంకటేశులు, తహసీల్దార్ శనివారం ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో స్థిరాస్తి దళారీ శ్రీపతి శ్రీనివాస్, వీఆర్వో కళానంద్‌రెడ్డి, సర్వేయర్లు సందీప్‌రెడ్డి, వాసుదేవరెడ్డిల పాత్ర ఉన్నట్లుగా గుర్తించి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పులివెందుల పురపాలక సంఘం పరిధిలోని ఈ భూమి మార్కెట్ విలువ రూ.2.89 కోట్లు ఉంటుందని అధికారులు తేల్చారు. డీకేటీ పట్టా తీసుకున్న లబ్ధిదారు.. తన భూమిని విక్రయించుకునేందుకు కలెక్టరు నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇందుకోసం కొందరు కలెక్టరు సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఎన్వోసీలతో దందా సాగించినట్లు వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన మేరకు భూదందా విలువ రూ.100 కోట్లవరకూ ఉంది. ఈ తరహాలో జరిగిన క్రయ విక్రయాల్లో మోసపోయిన వ్యక్తుల్లో సీఎం జగన్ సమీప బంధువులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అక్రమాలు ఎక్కడంటే?
పులివెందుల పురపాలక సంఘం పరిధిలో భూముల విలువ భారీగా పెరిగింది. అవుటర్ రింగ్ రోడ్డు వచ్చాక.. మరింతగా ధరలు పెరిగాయి. అక్కడే కె.వెలమవారిపల్లెలో సర్వే నంబరు 99/3లో 2.98, 99/1లో 4.26, 98/1లో 1.07, అహోబిలపురంలో 2/2ఎలో 4.55, 45/2లో 4.8, యర్రగుడిపల్లెలో 135/2లో 3, 135/2లో 3.87, బాకరాపురంలో 58/2లో 4.91, బ్రాహ్మణపల్లెలో 48/3లో 1.41, చిన్నరంగాపురంలో 220/2లో 3.51 ఎకరాల వంతున మొత్తం 34.36 ఎకరాల భూమికి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తేలింది.ఈ ఏడాది ఫిబ్రవరి 7న నకిలీ ఎన్వోసీలు జారీ అయ్యాయి. కలెక్టరు కార్యాలయంలో ఓ అధికారి అండదండలతోనే ఇవి జారీ అయినట్లు అనుమానిస్తున్నారు. పులివెందులలో ఎకరం రూ.3 కోట్ల వరకు ధర పలుకుతోంది. పులివెందుల పురపాలక పరిధిలో కె.వెలమవారిపల్లె, అహోబిలపురం, యర్రగుడిపల్లె, బాకరాపురం, బ్రాహ్మణపల్లె, చిన్నరంగాపురం తదితర గ్రామాల్లో చుక్కల భూములున్నాయి. ఈ భూములకు రిజిస్ట్రేషన్ జరగడంతో ఇవి పట్టా భూములుగా మారిపోయాయి. రిజిస్ట్రేషన్ తర్వాత ఇళ్ల స్థలాల కోసం ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు.
అధికార పార్టీ నేతల హస్తం
నకిలీ ఎన్వోసీలు సృష్టించడంలో వైకాపా నేతల హస్తం ఉంది. కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం, నకిలీ పత్రాల తయారీపై పులివెందుల ఆర్డీవో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదు. అధికార పార్టీ ఒత్తిళ్లతో కేసు నమోదు చేయలేదు. రెండు రోజుల్లో అధికారులు చర్యలు తీసుకోకపోతే అన్ని ఆధారాలతో కుంభకోణాన్ని మొత్తం బయటపెడతాం. ఇది వరకు ఎసైన్డ్ భూముల వ్యవహారంలోనూ అక్రమాలు జరగ్గా.. వెలుగులోకి తెచ్చాక పేదలకు న్యాయం జరిగింది. పులివెందుల కేంద్రంగా భారీ భూ దందాలు సాగుతున్నా పట్టించుకోవడంలేదు.
రాంగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Cyclones: ఏపీలో అయిదు దశాబ్దాల్లో 60 తుపాన్లు
వాతావరణ మార్పులు, ఇతర కారణాలతో బంగాళాఖాతంలో తుపాన్ల సంఖ్య తగ్గినా.. అప్పుడప్పుడు ఏర్పడినవే తీవ్ర రూపం దాల్చుతున్నాయి. -
Gold: తనఖా బంగారం పోతే బ్యాంకుదే బాధ్యత
ఆర్థిక అవసరాలు వస్తే ఇంట్లోని బంగారు ఆభరణాలను తనఖా పెట్టి, నగదు అప్పు తెచ్చుకోవడం సులభమైన మార్గం. -
Polavaram: పోలవరంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. వద్దన్నా నీళ్లు నింపుతున్నారని, కాఫర్‌డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులని నిలదీసింది. -
Cyclone Michaung: గాఢాంధకారంలో గ్రామాలు.. పట్టణాలు!
మిగ్జాం తుపాను ప్రభావంతో గాలులు, వర్షాలతో నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా విద్యుత్‌సరఫరా నిలిచిపోయి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. -
Tirumala: ఇదేమి అన్న ప్రసాదం?
తిరుమలలో నిత్యాన్నదానంపై వివాదాలు ముసురుకుంటున్నాయి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో నాణ్యత సరిగ్గా లేదంటూ పలువురు భక్తులు తితిదే సిబ్బందిపై తిరగబడ్డారు. -
AP Unemployment: రోజుకో నిరుద్యోగి ఆత్మహత్య
జాబ్ క్యాలెండర్ల జాడ లేదు... డీఎస్సీ మాటే లేదు... పోలీసు కానిస్టేబుళ్ల పోస్టులకు ఇప్పటికీ మోక్షం లేదు... గ్రూప్-1, 2 కొలువుల భర్తీకి అతీగతీ లేదు... నాలుగున్నరేళ్ల వైకాపా పాలనలో ప్రభుత్వోద్యోగాల కోసం ఎదురుచూసి.. చూసి నిరుద్యోగుల గుండెలు పగిలిపోతున్నాయి. -
అన్నదాతను దెబ్బతీసిన మిగ్జాం
ఎటు చూసినా పొలాల్ని చుట్టేసిన వరద.. వాననీటిలో తేలుతున్న వరి ఓదెలు.. కోతకు వచ్చిన పనలు నేలవాలి నీటమునగడంతో గల్లంతైన ఆశలు.. కుప్పలు పోసినా చెమ్మ చేరి దెబ్బతింటున్న ధాన్యం.. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లెదుటే చేజారిపోతుండటంతో కన్నీరుమున్నీరవుతున్న రైతన్నలు.. కోస్తా జిల్లాల్లో ఎటు చూసినా ఇవే దృశ్యాలు. -
అటు ప్రకృతి ప్రకోపం.. ఇటు జగన్ వికృత రూపం
రాష్ట్రంలోని రైతులు ఏటికేడు నష్టాల ఊబిలోకి దిగబడుతున్నారు. ప్రకృతితోపాటు వైకాపా సర్కారు పనితీరూ ఇందుకు కారణం. -
దేవాదాయశాఖలో ఉప, సహాయ కమిషనర్ పోస్టుల పెంపు
దేవాదాయశాఖ పరిధిలోని సంయుక్త కమిషనర్ (జేసీ), ఉప కమిషనర్ (డీసీ), సహాయ కమిషనర్ (ఏసీ), గ్రేడ్-1 ఈఓ పోస్టుల సంఖ్యలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. -
ఎస్టీ రిజర్వేషన్లతోనే వాల్మీకి బోయలకు న్యాయం
ఎస్టీ రిజర్వేషన్లు కల్పిస్తేనే వాల్మీకి బోయలకు న్యాయం జరుగుతుందని, ఆ రిజర్వేషన్ సాధన కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడతామని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి (వీఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దూరు సుభాష్ చంద్రబోస్ అన్నారు. -
3 నెలలుగా జీతాలందక ఎస్ఎస్ఏ ఉద్యోగుల అవస్థలు
మూడు నెలలుగా జీతాలు అందక సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. -
ఐఎస్ఏఎం కింద ఏపీకి రూ.39.97 కోట్లు విడుదల
సమీకృత వ్యవసాయ మార్కెటింగ్ పథకం (ఐఎస్ఏఎం) కింద ఆంధ్రప్రదేశ్‌కు 2020-21 నుంచి 2023-24 వరకు వివిధ ప్రాజెక్టులకు రూ.39.97 కోట్లు రాయితీ రూపంలో విడుదల చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. -
3 వేల కి.మీ. రహదారులు ధ్వంసం
తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 3 వేల కి.మీ. మేర ఆర్అండ్బీ రహదారులు ధ్వంసమయ్యాయి. సోమ, మంగళవారాల్లో జరిగిన నష్టాన్ని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. -
సర్కారు వారి బలవంతపు ఆట!
జగన్ ఆడమని చెబితే ఆడాల్సిందే... పోకిరి సినిమాలో ప్రకాష్‌రాజ్ అన్నట్టు గిల్లితే గిల్లించుకోవాల్సిందే..! మాకు ఆడటం తెలియదు మహాప్రభో వదిలేయండని మొత్తుకున్నా ప్రభుత్వం వినదు! -
కొండచరియలు పడి పట్టాలు తప్పిన గూడ్సు రైలు
కొత్తవలస - కిరండూల్ (కేకే) లైన్లో వెళ్తున్న గూడ్సు రైలుపై కొండచరియలు పడటంతో ఇంజిన్, ఓ బోగి పట్టాలు తప్పాయి. -
అరకు ఘాట్‌లో జారిపడిన కొండచరియలు
మిగ్జాం తుపాను కారణంగా అరకు ఘాట్ రోడ్డులో కొండచరియలు జారిపడటంతో అర్ధరాత్రి సమయంలో పర్యాటకులు అవస్థలు పడాల్సి వచ్చింది. -
పోలీసుల అకృత్యాల్లో మనదే ‘ఘనత’
ఎవరైనా న్యాయం కోసం పోలీసుస్టేషన్‌ను ఆశ్రయిస్తే బాధితులనే లాఠీలతో చితకబాదుతున్నారు. అధికార పార్టీ నాయకులకు ఎదురుతిరిగితే చాలు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. -
ఆరడుగులు మించిన అరటి గెల!
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు భూపతిరాజు వెంకట సత్యసుబ్బరాజుకు చెందిన తోటలో బొంత బక్కీస్ రకం అరటి గెల ఆరు అడుగులకు పైగా పెరిగింది. -
హజ్ యాత్రికుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
హజ్‌కు వెళ్లే యాత్రికులు ఈ నెల 20 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని హజ్ కమిటీ ఛైర్మన్ గౌస్ లాజామ్ తెలిపారు. -
నిబంధనల మేరకు ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు చేయండి
ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల 2023-26 సంవత్సర శ్లాబ్ కాలానికి చట్ట నిబంధనల మేరకు ఫీజులను నిర్ణయించాలని ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. -
అమరావతి అభివృద్ధిలో అలసత్వం తగదు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలికవసతుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వ అధికారులు చూపిన అలసత్వం పట్ల రాజ్యసభ ఎష్యూరెన్స్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది.


తాజా వార్తలు (Latest News)
-
Apply Now: ఫ్యాషన్ ప్రపంచం వైపు వెళ్తారా? ఇదిగో గొప్ప ఛాన్స్!
-
Apple: యూఎస్బీ-సి టైప్ నుంచి మినహాయింపు కోరిన యాపిల్
-
వాగుదాటుతూ ముగ్గురు గల్లంతు.. అల్లూరి జిల్లాలో గురువారం కూడా విద్యాసంస్థలకు సెలవు
-
Social Look: శ్రీదేవి డ్రెస్‌లో మెరిసిన ఖుషి కపూర్.. మృణాల్ ఠాకూర్ స్పెషల్ పోస్ట్
-
Digital India Act: ఎన్నికల తర్వాతే డిజిటల్ ఇండియా యాక్ట్: రాజీవ్ చంద్రశేఖర్
-
ఖాసీం సులేమానీ హత్యకు 50 బిలియన్ల డాలర్లు చెల్లించండి..అమెరికాకు ఇరాన్ కోర్టు ఆదేశం