Amaravati: ఒక్క రైతును చూసినా వణుకే!

ఆయనేమీ తీవ్రవాది కాదు.. కండలు తిరిగిన వీరుడు కాదు.. రక్తం మరిగిపోతూ ఏదైనా చేసేద్దాం అనుకునే యువకుడు అంతకంటే కాదు.. చేతికర్ర సహాయం లేనిదే సరిగ్గా నిలవలేని.. నడవలేని వృద్ధుడు.

Updated : 26 Sep 2023 08:28 IST

యనేమీ తీవ్రవాది కాదు.. కండలు తిరిగిన వీరుడు కాదు.. రక్తం మరిగిపోతూ ఏదైనా చేసేద్దాం అనుకునే యువకుడు అంతకంటే కాదు.. చేతికర్ర సహాయం లేనిదే సరిగ్గా నిలవలేని.. నడవలేని వృద్ధుడు. మరి ఆయన ముందు ఎందుకు అంతమంది పోలీసులు అనుకుంటున్నారా..? ఆయన రాజధాని రైతు. ఆయన నిలబడిన చోటు దీక్షాశిబిరం. 50 మందికిపైగా పోలీసులు ఆ రైతు ముందు గోడలా నిలబడితే.. వెనుక నుంచి కార్ల కాన్వాయ్‌లో వెళుతున్నది ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. రాజధానిని మూడు ముక్కలాట చేసి అమరావతికి కోసం భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడలేక, వారి సమస్య పరిష్కరించలేక రాజకీయ క్రీడ ఆడుతున్న సీఎం ఇలా పోలీసుల మాటున దాటిపోతున్నారు. ఇది గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం దీక్షాశిబిరం ముందు సోమవారం కనిపించిన చిత్రం.

ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు