‘మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు’

‘మా స్నేహం మీద ఒట్టు. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు’ అని తెదేపా అధినేత చంద్రబాబు బాల్య స్నేహితులు, సన్నిహితులు పేర్కొన్నారు.

Updated : 28 Sep 2023 12:33 IST

చంద్రగిరి, న్యూస్‌టుడే: ‘మా స్నేహం మీద ఒట్టు. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు’ అని తెదేపా అధినేత చంద్రబాబు బాల్య స్నేహితులు, సన్నిహితులు పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తిరుపతి జిల్లా చంద్రగిరిలో చేపట్టిన రిలే దీక్షలో బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరికి నడిచి వచ్చి చదువుకున్న రోజులు గుర్తు చేసుకున్నారు. ‘చిన్నతనం నుంచే చంద్రబాబుది కష్టపడి పని చేసే స్వభావం. రాష్ట్ర సంక్షేమాభివృద్ధికి పరితపించే వారు. కుట్రలు, కుతంత్రాలు, నీతిమాలిన రాజకీయాలు ఆయనకు తెలియవు. కష్టం విలువ తెలిసిన వ్యక్తి. సీఎం జగన్‌ కక్ష సాధింపులో భాగంగానే ఆయన్ను జైలుకు పంపారు’ అని అభిప్రాయపడ్డారు. అక్టోబరు ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్‌ నేషనల్‌ కన్వీనర్‌ సాయిస్వామి తెలిపారు. కార్యక్రమంలో చంద్రబాబు బాల్య మిత్రులు కొమ్మినేని శ్రీనివాసులునాయుడు, గిరిధర్‌రెడ్డి, భూపాల్‌నాయుడు, నారా ప్రతాప్‌నాయుడు, సుబ్రహ్మణ్యంనాయుడు, దుబాసి రామ్మూర్తి, అనార్కలి, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని