లంబో‘ధర’

హైదరాబాద్‌ రాయదుర్గంలోని మై హోం భూజా అపార్ట్‌మెంట్స్‌లో బుధవారం వినాయక లడ్డూ వేలం పాట పోటాపోటీగా సాగింది.

Updated : 28 Sep 2023 06:40 IST

 మై హోం భూజాలో రూ.25.50 లక్షలకు లడ్డూ వేలం

రాయదుర్గం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ రాయదుర్గంలోని మై హోం భూజా అపార్ట్‌మెంట్స్‌లో బుధవారం వినాయక లడ్డూ వేలం పాట పోటాపోటీగా సాగింది. అపార్ట్‌మెంట్‌ వాసి, నిర్మాణ రంగ వ్యాపారి ఈదులకంటి చిరంజీవిగౌడ్‌, సుష్మిత దంపతులు రూ.25.50 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. మూడేళ్లుగా ఇక్కడ లడ్డూ వేలం నిర్వహిస్తుండగా గతేడాది రూ.20.50 లక్షలు, 2021లో రూ.18.50 లక్షలు  పలికిందని నిర్వాహకులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు