టీఐఎఫ్‌ఆర్‌ శాస్త్రవేత్తకు జేసీ బోస్‌ ఫెలోషిప్‌

గోపన్‌పల్లి టీఐఎఫ్‌ఆర్‌ (టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌) శాస్త్రవేత్త ఉల్లాస్‌ ఎస్‌ కొల్తూర్‌ను ప్రఖ్యాత ‘జేసీ బోస్‌ ఫెలోషిప్‌’ వరించింది.

Updated : 28 Sep 2023 06:40 IST

రాయదుర్గం, న్యూస్‌టుడే: గోపన్‌పల్లి టీఐఎఫ్‌ఆర్‌ (టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌) శాస్త్రవేత్త ఉల్లాస్‌ ఎస్‌ కొల్తూర్‌ను ప్రఖ్యాత ‘జేసీ బోస్‌ ఫెలోషిప్‌’ వరించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ బోర్డ్‌ (ఎస్‌ఈఆర్‌బీ) ‘జేసీ బోస్‌ ఫెలోషిప్‌’ను అందజేస్తుంది. మాలిక్యులర్‌ ఫిజియాలజీ, జీవ క్రియ సంబంధ వ్యాధులు, వయసుపై ఆయన చేసిన కీలక పరిశోధనలకు ఈ అవార్డును ప్రకటించారు. ఉల్లాస్‌, ఆయన పరిశోధన బృందం శారీరక ధర్మశాస్త్రంపై లోతైన పరిశోధనలు చేస్తోంది. టీఐఎఫ్‌ఆర్‌ నిర్వహిస్తున్న జాతీయ పరిశోధన కార్యక్రమం.. అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ యూనిట్‌ ఆన్‌ మెటబాలిజం, డెవలప్‌మెంట్‌ అండ్‌ ఏజింగ్‌ (అరుండా) చేపడుతున్న పరిశోధనలకూ ఆయన నాయకత్వం వహిస్తున్నారు. మరోవైపు ఇస్రోతో కలిసి అంతరిక్షయానం ద్వారా వయసుపై పడే ప్రభావంపైనా అధ్యయనం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు