సీపీఎస్‌ ఉద్యోగులకు చీకటి రోజు

శాసనసభలో బుధవారం జీపీఎస్‌ బిల్లును ఆమోదించటంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. సీపీఎస్‌ ఉద్యోగుల పాలిట చీకటి రోజని యూటీఎఫ్‌ ప్రకటించగా.. బ్లాక్‌ డే అంటూ ఏపీటీఎఫ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated : 28 Sep 2023 13:01 IST

విజయవాడలో ఉపాధ్యాయ సంఘాల నిరసనలు

విజయవాడ (గవర్నర్‌పేట), కర్నూలు బీక్యాంపు, న్యూస్‌టుడే: శాసనసభలో బుధవారం జీపీఎస్‌ బిల్లును ఆమోదించటంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. సీపీఎస్‌ ఉద్యోగుల పాలిట చీకటి రోజని యూటీఎఫ్‌ ప్రకటించగా.. బ్లాక్‌ డే అంటూ ఏపీటీఎఫ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ జీపీఎస్‌ ప్రతిపాదిత బిల్లులను దహనం చేశారు. గవర్నర్‌పేటలోని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్ష, ప్రధాన ఎన్‌.వెంకటేశ్వర్లు, కె.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌లు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జీపీఎస్‌ బిల్లును ఆమోదించి, వారి ఆశలను ప్రభుత్వం చిదిమేసిందని పేర్కొన్నారు. ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి లెనిన్‌ కూడలిలో కొవ్వొత్తులు వెలిగించి తమ నిరసన తెలియజేశారు.

అసెంబ్లీలో జీపీఎస్‌ను ఆమోదించిన రోజు సీపీఎస్‌ ఉద్యోగులకు చీకటిరోజని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మన్న, జిల్లా అధ్యక్షుడు గోకారి, జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన్‌ పేర్కొన్నారు. జీపీఎస్‌ను ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొనేది లేదన్నారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో బుధవారం కర్నూలు కలెక్టరేట్‌ వద్ద ఉపాధ్యాయ సంఘం నాయకులు, సీపీఎస్‌ ఉద్యోగులు ధర్నా చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని