YS Jagan: ముఖ్యమంత్రికి ఇదేం ఆనందమో...!

ప్రజా సమస్యలు, రాష్ట్ర పరిస్థితిపై నిర్మాణాత్మక చర్చలు చేపట్టాల్సిన అసెంబ్లీ సమావేశాలను అధికార పార్టీ నవ్వులాటగా మార్చేసింది.

Updated : 28 Sep 2023 08:54 IST

ప్రజా సమస్యలు, రాష్ట్ర పరిస్థితిపై నిర్మాణాత్మక చర్చలు చేపట్టాల్సిన అసెంబ్లీ సమావేశాలను అధికార పార్టీ నవ్వులాటగా మార్చేసింది. మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ.. నాయకుడి చూపు తమపై పడకపోతుందా అని తాపత్రయపడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌లను ఉద్దేశించి వైకాపా మంత్రులు విమర్శలు చేస్తుంటే సీఎం జగన్‌ వాటిని ఆస్వాదిస్తూ.. చప్పట్లు కొట్టి, ప్రోత్సహించారు. అమరావతి అంతా అవినీతి కథల మయం, ఇన్నర్‌ రింగు రోడ్డు స్కాంలో లోకేశ్‌ను అరెస్టు చేయలంటూ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్‌, ఎమ్మెల్యే పేర్ని నాని ప్రసంగించినప్పుడు సీఎం పగలబడి నవ్వారు. చంద్రబాబు అరెస్టుపై మంత్రులు మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ సీఎం నవ్వుతూనే కనిపించారు. ఇది చూసిన వాళ్లు సీఎంకు ఇదేం ఆనందమో.. అంటూ తలలు పట్టుకున్నారు.

ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని