Pulivendula: కురుస్తున్న బస్టాండ్‌కు ఉత్తమ పర్యాటక అవార్డు!

చినుకుపడితే కురిసే పులివెందులలోని వైఎస్‌ఆర్‌ బస్‌ టెర్మినల్‌కు పర్యాటకశాఖ ‘ఉత్తమ పర్యాటక ఫ్రెండ్లీ బస్టాండ్‌’ అవార్డు అందజేయడంపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

Updated : 28 Sep 2023 07:26 IST

ఈనాడు, అమరావతి: చినుకుపడితే కురిసే పులివెందులలోని వైఎస్‌ఆర్‌ బస్‌ టెర్మినల్‌కు పర్యాటకశాఖ ‘ఉత్తమ పర్యాటక ఫ్రెండ్లీ బస్టాండ్‌’ అవార్డు అందజేయడంపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. సాధారణంగా పులివెందుల ప్రాంతం సందర్శించే పర్యాటకులు ఉండరు.. అలాంటిది పర్యాటక ఫ్రెండ్లీ ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వార్షిక పర్యాటక ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌-2023 బుధవారం ప్రకటించింది. ఇందులోనే పులివెందుల బస్టాండ్‌ అవార్డు దక్కించుకుంది. ఇక్కడ రూ.22.5 కోట్లతో కొత్తగా బస్‌ టెర్మినల్‌ నిర్మించారు. దీన్ని గతేడాది డిసెంబరులో సీఎం జగన్‌ ప్రారంభించారు. నిర్మాణంలో నాణ్యత లోపం వల్ల వర్షం వచ్చినప్పుడల్లా పైకప్పు నుంచి నీరు కారుతోంది. ఈనెల మొదటి వారంలో నాలుగైదు చోట్ల నీరు లీకయింది. కురుస్తున్న చోటల్లా ప్లాస్టిక్‌ డబ్బాలు పెట్టడం, పారిశుద్ధ్య సిబ్బంది ఆ నీటిని ఎత్తిపోయడం అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. దీంతో కొన్ని మరమ్మతులు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు