ఉత్తమ పర్యాటక గ్రామంగా ‘లేపాక్షి’

రాష్ట్రంలోనే ఉత్తమ పర్యాటక గ్రామంగా 2023వ సంవత్సరానికిగాను శ్రీసత్యసాయి జిల్లాలోని ‘లేపాక్షి’ని ప్రకటిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 28 Sep 2023 05:12 IST

దిల్లీలో పురస్కారం అందుకున్న సర్పంచి

లేపాక్షి, న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే ఉత్తమ పర్యాటక గ్రామంగా 2023వ సంవత్సరానికిగాను శ్రీసత్యసాయి జిల్లాలోని ‘లేపాక్షి’ని ప్రకటిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బుధవారం దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర పర్యాటకశాఖ ఉన్నతాధికారుల చేతుల మీదుగా సర్పంచి ఆదినారాయణ పురస్కారం అందుకున్నారు. లేపాక్షిలో ప్రజల జీవనశైలి, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలన్నీ గ్రామీణ నేపథ్యంలో సాగుతాయి. ఇప్పటికే యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న లేపాక్షికి త్వరలోనే శాశ్వత జాబితాలో పేరు దక్కుతుందని సర్పంచి ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని