మాట తప్పి.. మడమ తిప్పారు

అధికారం చేపట్టిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తానని ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చిన జగన్‌.. సీఎం అయ్యాక మాట తప్పి, మడమ తిప్పారు.

Published : 28 Sep 2023 05:31 IST

ఐ.వెంకటేశ్వర్లు, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ

ఈనాడు, అమరావతి: అధికారం చేపట్టిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తానని ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చిన జగన్‌.. సీఎం అయ్యాక మాట తప్పి, మడమ తిప్పారు. ఉద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చి చివరికి వారినే దగా చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఎలా విస్మరిస్తారని శాసన మండలిలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని నిలదీస్తే.. సీపీఎస్‌ రద్దు హామీకి తప్పుడు భాష్యం చెప్పారు. జీపీఎస్‌పై ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ జరగలేదు. లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు జగన్‌ మాటల్ని నమ్మి మోసపోయారు. ఆర్టీసీ స్థలాల్ని కారుచౌకగా లీజులకిస్తూ.. ప్రజల ఆస్తుల్ని దోచుకుంటున్నారు.

పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం: రఘువర్మ, ఎమ్మెల్సీ

హామీని నెరవేర్చకుండా సీఎం జగన్‌ సీపీఎస్‌ ఉద్యోగుల్ని మోసం చేశారు. ఇది నిజంగా చీకటి రోజు. ఉద్యోగుల ఆశల్ని, ఆకాంక్షల్ని వమ్ము చేశారు. దీనిపై పెద్దఎత్తున ఉద్యమం చేస్తాం.

సుదీర్ఘ చర్చ తర్వాతే జీపీఎస్‌
- చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విస్తృత స్థాయి చర్చల తర్వాతే జీపీఎస్‌ తెచ్చాం. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మేలు జరుగుతుంది. ఈ విడత అసెంబ్లీ సమావేశాల్లో బీసీ జనగణన, జీపీఎస్‌ అమలు, అసైన్డ్‌ భూములపై హక్కుల కల్పన వంటి ప్రజాప్రయోజనాలు కలిగించే పలు చట్టాల్ని ఆమోదించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు