YV Subbareddy: ఏ హోదాలో వైవీ సుబ్బారెడ్డికి ఆహ్వానం?

ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గురువారం అబ్కారీశాఖ ప్రాంతీయ ల్యాబొరేటరీని ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి ప్రారంభించనున్నారు.

Updated : 28 Sep 2023 07:51 IST

ప్రభుత్వ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ‘వైవీ’ పేరు

ఈనాడు, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గురువారం అబ్కారీశాఖ ప్రాంతీయ ల్యాబొరేటరీని ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా మంత్రులు విడదల రజిని, గుడివాడ అమర్‌నాథ్‌, విశాఖ మేయర్‌ హరి వెంకటకుమారి హాజరవుతారు. ఎక్సైజ్‌శాఖ ఆహ్వానపత్రికలో ప్రత్యేక ఆహ్వానితులుగా వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి పేరు ముద్రించడం చర్చనీయాంశమైంది.

తితిదే బోర్డు మాజీ ఛైర్మన్‌గా, మాజీ ఎంపీగా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని ప్రభుత్వ కార్యక్రమానికి ఏ హోదాలో ఆహ్వానించారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నల వర్షం కురుస్తోంది. వైకాపా సమన్వయకర్తగా ఉన్న వైవీకి ప్రాధాన్యం ఇవ్వడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఓ ఉన్నతాధికారి అత్యుత్సాహం చూపినట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి అనుచరుడిగా ముద్ర వేసుకున్న సదరు అధికారి వైవీకి దగ్గరవ్వాలన్న ఆలోచనతోనే ఇలా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఏయూను వైకాపా కార్యాలయంగా మార్చారన్న విమర్శలున్నాయి. ఎక్సైజ్‌శాఖ ప్రయోగశాలను ఏయూలోని ఎనలిటికల్‌ కెమిస్ట్రీ విభాగంతో కలిసి ఏర్పాటుచేయడం వల్ల విద్యార్థుల ప్రయోగాలకు అనువుగా ఉంటుందని ఇక్కడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని