గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థతో నిజం చేశాం: సీఎం

‘గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశాం. మున్ముందు కూడా ఆయన చూపిన మార్గంలోనే నడుస్తాం. మహాత్ముని జయంతి సందర్భంగా నివాళులు’ అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

Published : 03 Oct 2023 04:41 IST

ఈనాడు, అమరావతి: ‘గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశాం. మున్ముందు కూడా ఆయన చూపిన మార్గంలోనే నడుస్తాం. మహాత్ముని జయంతి సందర్భంగా నివాళులు’ అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ సీఎం మరో ట్వీట్‌ చేశారు. ‘లాల్‌ బహదూర్‌ శాస్త్రి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. జై జవాన్‌-జై కిసాన్‌ అని ఆయనిచ్చిన పిలుపు నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆయన తీసుకొచ్చిన ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు దేశాన్ని శిఖరాగ్రాన నిలిపాయి’ అని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్ర పటాలకు ముఖ్యమంత్రి జగన్‌ పూలమాల వేసి నివాళినర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని