జైల్లో చంద్రబాబు సత్యాగ్రహం

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో తెదేపా అధినేత చంద్రబాబు సోమవారం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన ఎటువంటి ఆహారం తీసుకోకుండా నిరసన తెలిపారు.

Updated : 03 Oct 2023 06:33 IST

సాయంత్రం వరకు ఆహారం తీసుకోకుండా నిరసన

ఈనాడు - రాజమహేంద్రవరం, కాకినాడ: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో తెదేపా అధినేత చంద్రబాబు సోమవారం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన ఎటువంటి ఆహారం తీసుకోకుండా నిరసన తెలిపారు. జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న స్నేహబ్లాక్‌లోని గదిలో దీక్ష చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై తప్పడు కేసులు నమోదు చేసి, అన్యాయంగా జైల్లో నిర్బంధించి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. తనకు చట్టంపైనా, న్యాయంపైనా నమ్మకం ఉందని ఇటీవల చంద్రబాబు పేర్కొన్నారు. న్యాయం కోరుతూ జైల్లోనే ఆయన దీక్ష చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు